శనివారం, జూలై 27, 2024
Homeరాజకీయంఅక్రమ మైనింగ్ వ్యవహారంపై హైకోర్ట్ సీరియస్... శాటిలైట్ ఫోటోలు సమర్పించాలంటూ ఆదేశం

అక్రమ మైనింగ్ వ్యవహారంపై హైకోర్ట్ సీరియస్… శాటిలైట్ ఫోటోలు సమర్పించాలంటూ ఆదేశం

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అక్రమ మైనింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రభుత్వ వర్గాల్లో మరింత హీట్ రాజేస్తోంది. ప్రతిపక్ష నేత టీడీపీ మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ను ఎదో విధంగా చెక్ పట్టామని సంబరపడుతున్న అదికార పక్ష నేతలకు అక్రమ మైనింగ్ విషయంలో నేడు హైకోర్టు తీర్పుతో దిగిలు మొదలైంది.

తాజాగా ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై  హైకోర్టు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. పంట కాలువను పూడ్చి దానిపై నిర్మాణం చేపట్టిన వాళ్ళు అక్రమ మైనింగ్ కు పాల్పడలేదంటే మేము ఎలా నామాలంటూ హాయ్ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు చేసే పనులు కోర్టుని నమ్మించడానికి మాత్రమే అన్నట్టుగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కాలువ ఆక్రమణ వెనక ఉన్న దురుద్దేశ్యం ఎవ్వరికీ తెలియదనుకుంటున్నారా అంటూ అక్కడ ఆక్రమణ జరిగినందువల్లె హైకోర్టులో ఇన్ని ఫిటిషన్ లు నమోదయ్యాయని వ్యాఖ్యలు చేసింది. అక్రమన జరిగిన్ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేసించింది.

ఇక ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు విన్నాక హైకోర్టు ఘనుల తవ్వకాలు జరిగిన ప్రదేశానికి సంబందించిన శాటిలైట్ ఫోటోలను కొట్లుకి సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో అధికారులు ఇప్పుడు తలపట్టుకుంతున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా అక్రమ మైనింగ్ ప్రదేశాలకు సంబందించిన పాత శాటిలైట్ ఫోటోలను మంత్రి కొడాలి నాని కొత్త ఫోటోలుగా చూపిస్తున్నారని పలు ఫోటోలను సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న నేపద్యంలో హైకోర్ట్లు తీర్పుతో ఇప్పుడు అధికారులు చిక్కుల్లో పడ్డారు.

ఇక టీడీపీ నాయకులు సైతం అక్రమ మైనింగ్ ప్రదేశాలకు సంబందించిన శాటిలైట్ ఫోటోలతో పాటు మరికొన్ని ఫోటోల డేటా ఇప్పటికే రెడీ చేసుకున్నారు. ప్రధానంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపద్యంలో ఆ ప్రదేశంలో అక్రమ మైనింగ్ జరిగిందని తేలితే ఇప్పటికే పలు నివేదికల్లో అక్కడ ఎలాంటి మైనింగ్ జరగలేదని కోర్టుకి నివేదికలు ఇచ్చిన వారి బవితవ్యం త్వరలో తేలిపోనుంది.

Read also… దేవినేని ఉమ కు 14 రోజుల రిమాండ్ | Devineni Uma Remand

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular