గురువారం, ఫిబ్రవరి 22, 2024
Homeజాతీయంఈ ఎడ్ల రేటు తెలిస్తే గుండె ఆగిపోద్ది ...

ఈ ఎడ్ల రేటు తెలిస్తే గుండె ఆగిపోద్ది …

మైసూర్ ఎడ్లు చురుకుదనానికి పెట్టింది పేరు. ఇక కర్ణాటకలో ఇలాంటి ఎడ్లకు చాలా  అదిక గిరాకీతో పాటు అక్కడి రైతులు వీటి పెంపకానికి  కూడా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో  కర్ణాటకలో ఈ జత ఎడ్ల ధర చూసి అందరూ అవాక్కవుతున్నారు.

ఏకంగా రికార్డుస్థాయిలో జత ఎడ్ల విలువ రూ. 17 లక్షలు పలకడం ఆశ్చర్య పరించింది. దింట్లో విశేషం ఏంటంటే రెండేళ్ల ఇవే జతని రూ. 8 లక్షలకు కొన్న ఒక రైతు తనకి అమ్మిన వ్యక్తికే రికార్డు ధరకు అమ్మడమే స్పెషల్.

మహా లింగపుర్​లోని నందగావ్​లో సంగప్ప అనే రైతు అక్కిమారడికి చెందిన మల్లప్ప నుండి  2018లో ఆ జత ఎడ్లను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో వాటి ధర  రూ.8 లక్షలు. ఆ తర్వాత కొనుక్కున్న సంగప్ప ఆ జత ఎడ్లకి  రామ్​-లక్ష్మణ్​ అని నామకరణం చేసి మంచి పుష్ఠిగా పెంచి అంతకు డబుల్ రేటుకి మళ్ళి అదే రైతుకి అమ్మి రికార్డు సృష్టించాడు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular