డయాలసిస్ పేషెంట్స్ పాటించవలసిన జాగ్రత్తలు

0
262
Health Care Tips for Dialysis Patients
Health Care Tips for Dialysis Patients

ఈ రోజుల్లో డయాలసిస్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆ పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చే బాడీ ఆర్గన్  కిడ్నీ..కిడ్నీ మన బాడీ లో ని వేస్ట్ ని తీసేసి రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఆ వేస్ట్ అనేది మనం తినే ఆహరం వల్ల ఫార్మ్ అవుతుంది. ఈ క్లీనింగ్ ప్రోసెస్ మన బాడీ లో 24 గంటల పాటు జరుగుతూనే ఉంటుంది..

ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయితే ఆ ఆహారం వల్ల వచ్చిన వేస్ట్ ని క్లీన్ చేయడం కేవలం డయాలసిస్ వల్లే సాధ్యం అవుతుంది.

డయాలసిస్ అనేది రోజు విడిచి రోజు చేయించుకునే చెకప్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ వల్ల మన బాడీ లోని వేస్ట్ మొత్తం క్లీన్ అయ్యి బ్లడ్ ఫిల్ట్రేషన్ జరుగుతుంది. డయాలసిస్ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు తినే ఆహరం లో ఉప్పు , సోడియం మరియు పొటాషియం కంటెంట్ కూడా తక్కువగా ఉండాలి ..

Health Care Tips for Dialysis Patients

ఇక ఈ వ్యాధి కలిగిన వాళ్ళు క్యాబేజి మరియు కాలీఫ్లవర్ ను తీసకోవచ్చు ఎందుకంటే వాటిలో విటమిన్లు బాగా ఉంటాయి. ఈ పేషెంట్స్ గుడ్డు లోని తెల్లటి భాగాన్ని మాత్రమే తినాలి అందులో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. వీళ్ళు రెడ్ గ్రేప్స్ , బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, అనాస పండ్లు బాగా తినాలి.

ఇప్పుడు చెప్పిన ఆహరాన్ని క్రమంగా డైట్ ప్రకారం  తీసుకోవాలి. దీన్ని రెనాల్ డైట్ అని అంటారు.ఈ డైట్ ని నిర్లక్ష్యం చేయకుండా పాటించాలి. ఎటువంటి బయట ఆహరం తీసుకోకూడదు. ధూమపానం మరియు మధ్యపానం అస్సలు మంచిది కాదు. నిర్లక్ష్యం చేస్తే  వ్యాధి ముదిరే అవకాశం ఉంది. వాటిని దరి చేరనివ్వకూడదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే డయాలసిస్ ద్వారా మన ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. కిడ్నీ ఫేల్యూర్ తో భాధ పడేవాళ్ళు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.