శుక్రవారం, జూలై 26, 2024
Homeహెల్త్ప్రోటీన్ తీసుకోవడం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

ప్రోటీన్ తీసుకోవడం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

నేటి  రోజుల్లో ప్రతీ ఒక్కరూ బయట ఆహరానికి బాగా అలవాటు పడిపోయారు. అలా ప్రతీ రోజూ ఫాస్ట్ ఫుడ్స్  తినటం వల్ల ఆరోగ్యం క్షీనిస్తుంది. ఆరోగ్యం క్షిణించటం వల్ల మనం అనేక ఇబ్బందులు  తలెత్తుతాయి. అటువంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండాలంటే  ముందుగానే జాగ్రత్త పడాలి  ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో తగిన ప్రోటీన్స్ ఉండాలి.

 అసలు ఈ ప్రోటీన్స్ మన శరీరానికి ఎలా ఉపయోగ పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం :-

ప్రతీ రోజూ తగిన మొత్తంలో ఆహారంలో ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనిషి మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యాంగా ఉండగలుగుతాము. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్  లో సమతుల ప్రోటీన్ కంటెంట్ ఉండడం చాలా ముఖ్యం. ప్రోటీన్ ఎక్కువగా లబించే చేపలు కానీ గుడ్లు కానీ తినాలి. ఒకవేళ శాకాహారి అయితే తృణ దాన్యాలు సోయాబీన్స్ కానీ పాలు కానీ తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల శరీరం ఆరోగ్యాంగా ఉంటుంది.

పెద్దల విషయానికొస్తే వీరికి రోజుకు 56 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం అవుతుంది. శిశువులకు రోజుకు 10 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. స్కూల్ కి వెళ్లే పిల్లలకు 19 గ్రామ్స్ వరకు ప్రోటీన్  అవసరం. ఇక గర్భిణీ స్త్రీలకు రోజుకు 71 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఈ ప్రోటీన్స్ ను ప్రతీరోజూ పండ్లు, కూరగాయలు మరియు త్రినదాన్యాలు వంటి కార్బోహైడ్రేట్స్ తో జత చేసి మన ఆహరం లో బాగం చేసుకోవడం వల్ల మన శరీరం లోని మెటబోలిక్ శాతం  బాగా పెంచుతుంది. దీనివల్ల మన శరీరం ఎటువంటి రోగాన్నైన దరిచేరనివ్వకుండా  సులభంగా గా ఫైట్ చెయ్యచ్చు.

ఇప్పటి వరకు ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసుకున్నాం. దాని వల్ల కొంతవరకూ నష్టాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం :-

ఆహారంలో బాగంగా ప్రొటీన్ తీసుకోవడం మంచిదే అయితే అది తగు మోతాదులో మాత్రమె ఉండాలి  ప్రోటీన్ ను అధికంగా తీసుకోవడం కూడా శరీరానికి  అంత మంచిది కాదు. దాని వల్ల కొంత మంది బరువు  పెరుగుతారు. మరి కొంతమందికి కొలెస్ట్రాల్ కుడా ఎక్కువగా పెరగొచ్చు. కాబట్టి ప్రోటీన్స్ ను కూడా వీలైనంతవరకూ పైన చెప్పుకున్న లిమిట్ ప్రకారం తీసుకోవడం ఉత్తమం. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కానీ లిమిట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular