Ajwain in telugu దీనినే తెలుగులో వాము Vamu అని పిలుస్తారు హిందీ భాషలో దీనిని అజ్వైన్ అని వృక్ష శాస్త్ర పరిభాషలో Carom Copticum అని పిలవడం జరుగుతుంది. ప్రకృతి మానవాళికి ప్రశాదించిన దివ్య ఔషదాలలో ఈ Ajwain కూడా ఒక్కటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి ఎందుకు ఇంత ప్రాచుర్యం అంటే దీనిలో ఉండే అనేక ఔషధ గుణాలతో పాటు శరీరంలోని అనేక రోగాలను నయం చేసే ఔషధ గుణాలు వాముVamu లో దాగి ఉన్నాయి.
Ajwain in Telugu నేటి రోజుల్లో సాధారణంగా ఇంట్లో కుటుంబసభ్యులలో ఎవరికైనా ఆరోగ్యం భాగాలేకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది చిన్న సమస్య అయినా కూడా వేల రూపాయలు మందులకు పోసి చివరికి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ తో ఎంతో మంది భాధపడుతున్నాం.
పూర్వ కాలంలో ఇలాంటి చిన్న చిన్న సంస్యలనుండి బయటపడడానికి పెద్దవాళ్ళు పండుగ రోజుల్లో జంతికలు, అప్పడాలు, వాము బజ్జీలు వంటివి చేసేవారు దీనికి కారణం రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికే పెద్దలు ముందు జాగ్రత్తగా ఇలాంటివి చేసేవారు.
ఇక పూర్తి వివరాలలోకి వెళితే వాములో థైమాల్ (Thymol) అనే ఒక రకమైన నూనె లాంటి పదార్ధం ఉండడం వల్ల దీనికి అనేక ఔషద గుణాలు ఉంటాయి. వాము చెట్టు మరియు గింజలు చిన్నగా ఉన్నా వీటిలో దాగి ఉన్న ఔషధ గుణాలు మాత్రం అమోఘం అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తలనొప్పి మరియు జలుభు నివారణకు
ఎక్కువగా జలుబు మరియు తలనొప్పితో భాదపడేవారు కొద్దిగా వాము తీసుకుని దానిని ఒక కాటన్ గుడ్డలో వేసి కొద్దిగా దానిని నలుపుతూ వాసన చూసినట్లైతే త్వరగా తలనొప్పి సమస్య నుండి బయటపడతారు. ఇక జలుబుతో ముక్కు దిబ్బడ ఉన్నవారు వాము గింజలను వేయించే సమయంలో వచ్చే పొగను పీలిస్తే ముక్కుదిబ్బడ వెంటనే తగ్గుతుంది.

2. చెవి పోటు తగ్గటానికి
చెవిలో పోటు ఉన్నవారు కొద్దిగా వాము మరియు వెల్లుల్లిపాయ మరియు నువ్వుల నూనె ఈ మూడింటినీ బాగా నూరి దానిని వేడి చేసి ఒక కాటన్ గుడ్డలో వేసి బాగా పిండితే నూనె వస్తుంది ఆ నూనెను చెవిపోటు ఉన్న చెవిలో వేస్తే ఉపసమనం లభిస్తుంది. అయితే నూనె చెవిలో వేసుకునేటప్పుడు కాటన్ గుడ్డ లో ఉన్న వెల్లుల్లి మరియు సోంపు వంటి తుక్కులు చెవిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి.

3. నీల్లవిరేచానాలు తగ్గడానికి
రెండు స్పూన్ల వాము తీసుకుని దానిలో కొద్దిగా నీళ్ళు కలిపి భాగా మరిగించి కషాయంలా తయారు చేసుకుని వెచ్చ వెచ్చగా ఉన్నప్పుడు అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా తాగుతున్నట్లైతే నీళ్ళ విరేచంనాలు తగ్గుతాయి.
4. అజీర్ణానికి
కొద్దిగా వామును తీసుకుని దానిని దోరగా వేయించి దానిలో 3 లేదా 4 మియాలు మరియు ఆనిలో చిటికెడు కల్లుఉప్పు కలిపి దానిని చూర్ణం లాగా చేసి ఆ చూర్ణాన్ని అజీర్ణం ఉన్నవారు భోజనానికి ముందు తీసుకుంటే అజీర్ణం సమస్య తగ్గుతుంది. అంతేకాక కొంతమంది భోజనం అధికంగా భుజించినా లేదా త్వరగా అరగని భోజనం అంటే బిర్యానీ, చికెన్ వంటి ఆహారాలు తీసుకున్నప్పుడు త్వరగా అరగదు దీనితో అజీర్ణం సమస్య వస్తుంది ఇలాంటి వారు పైన చెప్పిన విధంగా వాముని తీసుకున్నట్లయితే వెంటనే అజీర్ణం సమస్య దూరమౌతుంది.

5. మొలల వ్యాది తగ్గడానికి
అత్యంత భాదను కలిగించే వ్యాదులలో ఈ మొలల వ్యాది ఒకటి. దీనినే పైల్స్ లేదా మూలశంఖ అనికూడా పిలుస్తారు మలద్వారం వద్ద బొడిపెలు వలే బయటికి పొడుచుకు వస్తాయి వీటినే మొలలు అంటారు. ఈ మొలల వ్యాది రెండు రకాలు వాటిలో 1. బాహ్య మొలలు 2. అంతర మొలలు. ఈ మొలల వ్యాది ఉన్నవారు ఒక ½ టీస్పూన్ వామును తీసుకుని దానిని వేయించి పొడిచేసి 1/2టీస్పూన్ పసుపు తీసుకుని ఈ రెండింటినీ బాగా కలిపి బాహ్య మొలలు ఉన్నవారు ప్రతీరోజూ ఈ చూర్ణాన్ని మొలలు ఉన్న చోట లేపనంగా పూయాలి ఇలా కొన్ని రోజులు చేసినట్లైతే మొలల వ్యాది నుండి ఉపశమనం లబిస్తుంది.
6. చిన్నపిల్లల కడుపు ఉబ్బరం
ఒక చెంచా Vamu ఒక చిటికెడు సొంటి పొడి చిటికెడు దుమ్పరాసచూర్ణం తీసుకుని వీటిని నీళ్ళల్లో పోసి మరిగించి చివరగా మిగిలిన కషాయాన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

7. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి
ప్రొద్దున్న భోజనం చేసేముందు మరియు సాయంత్రం భోజనానికి కొంత సమయం ముందుగా కొంచే వాము మరియు నీళ్ళు తీసుకుని నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలినట్లైతే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కరుగుతుంది.
8.నోట్లోని పుళ్ళు తగ్గడానికి
నోట్లో పుళ్ళు సమస్య ఉన్నవారు కొంచెం వాముని తీసుకుని దానిని కషాయంలాగా తయారు చేసుకుని వడపోసి మిగిలిన నీళ్ళను అప్పుడప్పుడూ నోట్లో వేసుకుని పుక్కిలించి వేస్తే తొందరగా నోట్లోని పుళ్ళు తగ్గిపోతాయి.
9. కడుపులో గ్యాస్ సమస్యకు
ఒక గ్లాసులో కొద్దిగా నీళ్ళు తీసుకుని దానిలో కొంచెం Vamu వేసి త్రాగినట్లైతే అజీర్తి మరియు కడుపులో ఉండే గ్యాస్ సమస్య నుండి ఉపసమనం లబిస్తుంది.
10. శరీరంపై వచ్చే దద్దుర్లు
చాలా మందిలో ఎక్కువగా వేదించే సమస్యలలో ఈ దద్దుర్ల సమస్య ఒకటి ఈ దద్దుర్లు కొందరికి వచ్చి ఒకటి లేక రెండు రోజుల్లో తగ్గిపోతే కొంతమందికి మాత్రం ఇవి సంవత్సరాల తరబడి మొండి వ్యాధి లాగా వేదిస్తుంటాయి దీనికి ప్రదాన కారణాలు అనేకం ఉన్నాయి వాటిలో
- శరీరంలో మలబద్దకం ఉండడం
- జీర్ణాశయ వ్యాదులు ఉండడం
- ప్రేగులలో నులిపురుగులు ఉండడం
- మానసిక ఒత్తిడి ఉండడం
- కొన్ని వ్యాదులను తగ్గించుకోవడానికి యాంటీ బయోటిక్ ట్యాబ్లేట్ లను అదికంగా వాడడం.
ఇప్పుడు దద్దుర్లు తగ్గడానికి వేయించిన వాము తీసుకొని దానిని పొడిని చేసినది ఒక 50గ్రా మరియు బెల్లం 100గ్రాములు రెండూ కలిపి కొంచెం మెత్తగా చేసి దానిని మూడు లేదా నాలుగు గ్రాములు అంటే చిన్న చెంచా లో కొంచెం తక్కువ పరిమాణంలో తీసుకుని ఉదయం మరియు సాయంత్రం దీనిని నోట్లో వేసుకుని సేవించడం వల్ల శరీరంపై వచ్చిన దద్దుర్లు తగ్గిపోతాయి. అంతేకాక ఉదర సంభందిత వ్యాదులనుండి కూడా ఉపశమనం లబిస్తుంది.

FAQ
- Ajwain Seeds In Telugu – అజ్వైన్ ను తెలుగులో ఏమని పిలుస్తారు?
Answer : అజ్వైన్ ను తెలుగులో వాము అని పిలుస్తారు
- Ajwain Benefits in Telugu – అజ్వైన్ సేవిస్తే ఎలాంటి ఉపయోగాలు లభిస్తాయి.
Ajwain అనగా వామును ప్రతీరోజూ ఉదయం సాయంత్రం తగిన మోతాదులో బోజనానికి కొద్ది సేపు ముందుగా నోట్లో వేసుకుని నమిలి మింగినట్లైతే అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో గ్యాస్ సమస్యతోపాటు గర్భాశయ దోషాలను నివారిస్తుంది.
- Can we take Ajwain daily – వాముని ప్రతీరోజూ తీసుకోవచ్చా?
Answer : తప్పకుండా వాముని ప్రతీరోజూ ఉదయం టిఫెన్ చెయ్యడానికి అరగంట ముందు తీసుకుని అరగంట తరువాత టిఫెన్ చెయ్యాలి అయితే వాముని కాళీ కడుపుతో వాముని అదికంగా తీసుకోకూడదు.
- What are the side effects of Ajwain – వాము తీసుకోవడం వాళ్ళ ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి?
Answer : వాములో థైమాల్ (Thymol ) అనే ఒక రసాయనం ఉంటుంది కావున ఒక రోజులో సాధారణంగా తీసుకోవాల్సిన దానికంటే అధికంగా వామును తీసుకున్నట్లైతే కడుపులో ఎసిడిటీ మరియు గ్యాస్ పెరుగుతుంది. అంతేకాక Thymol అనే రసాయనం వల్ల శరీరంపై ఎలర్జీ, వికారం, తలనొప్పి, వాంతులు వంటివి వామును అధికంగా తీసుకున్న వారికి ఇలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది.