శుక్రవారం, మార్చి 29, 2024
Homeహెల్త్జుట్టు రాలకుండా మగవాళ్ళు తీసుకోవలిసిన జాగ్రత్తలు | Hair Fall Tips

జుట్టు రాలకుండా మగవాళ్ళు తీసుకోవలిసిన జాగ్రత్తలు | Hair Fall Tips

ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది ప్రపంచం వ్యాప్తంగా   ఉన్న  సర్వ సాధారణమైన సమస్యల్లో ఒకటి..

ఈ సమస్య గురించి అందరూ భాద పడుతూ ఉంటారు. మొదటగా జుట్టు రాలడానికి కారణం  మనం తీసుకునే ఆహరం, మినరల్స్ లోపం , ఒత్తిడి, మరియు కాలుష్యం, లేకపోతే జెనెటిక్స్ కూడా అయ్యుండొచ్చు.

Hair Growth Tips in Telugu

  • షాంపూ తో కడగాలి :- మన జుట్టుని రెగ్యులర్ గా షాంపూ తో రుద్దడం వల్ల జుట్టు రాలడం కొంత వరకు నివారించొచ్చు అయితే అదిక మోతాదులో షాంపూ లు వాడటం వల్ల కూడా వాటిలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ వల్ల కూడా జుట్టు ఊడిపోయే ప్రమాదముంది.
  • విటమిన్ మరియు ప్రోటీన్ లోపాలు :- విటమిన్స్ అనేవి మన శరీరానికి మాత్రమే కాదు. అవి మన తలకు, జుట్టుకు కూడా ఉపయోగపడతాయి. విటమిన్ E  వల్ల మన తలలో బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరుగుతుంది. చేపలు తినటం వల్ల కూడా మన బాడీ కి మరియు జుట్టు కి ప్రోటీన్ బాగా లభిస్తుంది.
  • ఆయిల్ తో స్కాల్ప్ మసాజ్ :- బాదం ఆయిల్ తో కాని లేదా ఆలివ్ ఆయిల్ తో కానీ మన తలను మసాజ్ చేస్కుంటూ ఉండాలి. దాని వల్ల జుట్టు కుదుళ్ళ వరకు నూనె చేరి మన జుట్టును సురక్షితంగా కాపాడుతుంది.
  • తడి జుట్టును బ్రష్ చేయడం మానుకోవాలి :- మనం తడి జుట్టును బ్రష్ చేయడం వల్ల జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దువ్వాలి అనుకుంటే దువ్వెన లో పళ్ళు దూరంగా ఉన్న పక్కనుంచి దువ్వండి. ఒకవేళ చిక్కు తియ్యాలి అనుకుంటే చేతి వేళ్ళను ఉపయోగించండి. దాని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
  • వెల్లుల్లి రసం, ఉల్లిపాయ రసం లేదా అల్లం రసం :- వీటిలో ఏదో ఒక రసాన్ని రాత్రి పూట తలకి రుద్దుకొని ఒక క్యాప్ లాంటిది పెట్టుకుని ప్రొద్దున్నే లేచాక వాష్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారం పాటు చేస్తే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు.
  • . హైడ్రాటెడ్ గా ఉండాలి :- రోజుకు నాలుగు గ్లాసుల వాటర్ తాగాలి. దానివల్ల మనం హైడ్రేటెడ్ గా ఉంటాము. అది మన జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.
  • గ్రీన్ టీ తలకు పట్టించండి :-  మొదటగా రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ ను ఒక కప్పు నీళ్లలో కలుపుకుని వేడి చేసుకుని తరువాత దాన్ని చల్లార్చుకొని ఆ మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. గంట తర్వాత తలను బాగా వాష్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారం పాటు చేస్తే తప్పకుండా మార్పు కనిపిస్తుంది.

జుట్టు రాలకుండా ఉండాలంటే చేయకూడని పనులు 

ప్పటివరకు మనం జుట్టును ఎలా కాపాడుకోవాలో  అంటే జుట్టుకు ఏది మంచిదో చూసాం. అలా కాపాడుకోవాలి అంటే అసలు జుట్టుకు చెడు కలిగించేవి ఏంటో తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

జుట్టు రాలకుండా ఉండాలంటే ఆల్కహాల్ తీసుకోకూడదు. దాని వల్ల జుట్టుపై చాలా ఎఫెక్ట్స్ పడతాయి. ఎక్కువ శాతం జుట్టు రాలిపోతుంది.

రోజుకు 30 నిమిషాలు వాక్ గాని సైకిలింగ్ కానీ చేయాలి. దాని వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల జుట్టు కూడా రాలడం తగ్గుతుంది.

అంటే దీనర్థం శారీరిక శ్రమ పెంచుకోవాలి మరియు తల కు చెమట పట్టకుండా చూసుకోవాలి. చెమటతో అలా వదిలేస్తే డాండ్రఫ్ పెట్టేసి జుట్టు ఇంకా పాడైపోతుంది. జుట్టుకు కలర్ వేసుకోవడం వంటివి చేయకూడదు. సాధ్యమైనంత వరకు అటువంటి కెమికల్స్ కు దూరంగా ఉండాలి.

ఇవన్నిటి కంటే ముందు ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం బాగుంటేనే జుట్టు కూడా బాగుంటుంది. మన ఆరోగ్యం పైనే జుట్టు పెరుగుదల ఆధారపడి ఉంటుంది..

క్రమం తప్పకుండా ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తే జుట్టు చాలా సురక్షితంగా కాపాడుకోవచ్చు.

జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ ని తప్పక ఫాలో అవ్వండి. అలా చేస్తే తప్పక మార్పులు కనబడతాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular