May 31, 2020

గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి చక్కటి ఉపాయం | Gas trouble tips in telugu

Gas trouble tips in telugu

Gas trouble tips in telugu

ఈ రోజుల్లో చిన్న పెద్దా తేడా  లేకుండా గ్యాస్ ప్రాబ్లం తో చాలామంది బాధపడుతున్నారు. గ్యాస్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటం, లేదా గుండెల్లో మంటగా ఉండడం, ఇలాంటి చాలా సమస్యలు ఎదుర్కొంటారు.

మనకు  గ్యాస్ ట్రబుల్ అనేది మనం ఎంచుకుని తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారాన్ని బట్టే మనం ఆరోగ్యంగా ఉంటాము.

Gas trouble tips in telugu :-

బీన్స్, చిక్కుడు కాయలు,  క్యాబేజ్ తినడం వల్ల మరియు షుగర్ జ్యూసెస్ తాగడం వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణం అవ్వదు.

ఈ సమస్యని మనం బయట మందులు ఉపయోగించకుండా మన ఇంట్లో సాధారణంగా కిచెన్ లో దొరికే వస్తువులతో ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దాం…..

  1. జీరా వాటర్….

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించుకోవడానికి జీరా వాటర్ తాగుతూ ఉండాలి. జీరా వాటర్ తాగడం వల్ల మన శరీరంలో జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గ్యాస్ ట్రబుల్ నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

  1. అల్లం…..

అల్లం కూడా గ్యాస్ ప్రాబ్లం తగ్గించడానికి బాగా  ఉపయోగపడుతుంది. ఇది ఆయుర్వేదంలో  కీలక భూమిక పోషిస్తుందని  కూడా చెప్పుకోవచ్చు. దీన్ని భోజనం తర్వాత ఒక టీస్పూన్ లైన్ జ్యూస్ తో కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. దీని వల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

  1. లైమ్ జ్యూస్ మరియు బేకింగ్ పౌడర్….

ఇది కూడా ఒక హోమ్ రెమెడీ. ఒక టీస్పూన్ లైమ్ జ్యూస్ లో అర టీస్పూన్ బేకింగ్ పౌడర్ కలుపుకొని, ఒక కప్పు నీటిలో వేసుకుని తాగడం వల్ల మన బాడీ లో జీర్ణ వ్యవస్థ మెరుగు పడి మన జీర్ణక్రియ సులభమవుతుంది. ఇలా చేయటం వల్ల ఎటువంటి గ్యాస్ ట్రబుల్ ఉండదు.

పైన చెప్పినవన్నీ క్రమం తప్పకుండ తీసుకుంటే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు. గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వాళ్ళు ఈ టిప్స్ ను తప్పక పాటించండి. కత్చితంగా మార్పులు గమనిస్తారు……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *