గురువారం, మార్చి 28, 2024
Homeజాతీయంవిశాఖ వరుస దారుణాలు.. మళ్ళీ గ్యాస్ లీకేజ్ ప్రమాదం.

విశాఖ వరుస దారుణాలు.. మళ్ళీ గ్యాస్ లీకేజ్ ప్రమాదం.

విశాఖ లోని LG POLYMER’S వద్ద జరిగిన ఘటన వల్ల అక్కడ ప్రజలందరు భయాందోళన చెందుతున్నారు. మొన్న గురువారం తెల్లారుజామున ప్రమాదవశాత్తు విషవాయువలు లీక్ కాగా..అవి మళ్ళీ నిన్న అర్ధరాత్రి గ్యాస్ లికైందని వార్తలు వచ్చాయి.. వాయు గాఢతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు . రసాయన వాయువు వాసన  మాధవధార  దాకా వ్యాపించింది.

సింహాచలం, గోపాలపట్నం, పినగాడి ప్రాంతాల ప్రజలు  ఆటోలు, బైక్ ల పై దూరంగా వెళ్లిపోయారు. పరిశ్రమలోకి  10 ఫైర్ఇంజన్లు, 2 ఫోమ్ ఫైటర్లు పంపారు . దానిని అదుపు చేసేందుకు అధికారులు  తీవ్రంగా శ్రమించారు.  ప్రజలు ఎవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, నిన్న దానిని అదుపు చేసినట్లు ప్రకటించిన అధికారులు.

నష్ట పరిహారం విడుదల చేసిన AP ప్రభుత్వం..

అయితే ఇటీవల జరిగిన ఈ ఘటనలో బాధితులగా మారిన కుటుంబాలకు ఏపి ప్రభుత్వం రూ.30 కోట్లు నష్ట పరిహారం విడుదల చేస్తూ జీవో జారీ చేయగా.. మృతుల కుటుంబానికి రూ. కోటి ఇవ్వగా.. ప్రాథమిక  వైద్యం తో బయట పడిన వారికి రూ.25 వేలు, 2-3 రోజులు ఆసుపత్రిలో ఉన్న వారికి రూ. లక్ష, వెంటిలేటర్ల పై చికిత్స పొందిన వారికి రూ. పది లక్షలు, ఈ ఘటన తో ఇబ్బంది పడ్డా ప్రతీ ఒక్కరికీ రూ. పది వేలు ఇవ్వనున్నట్లు. ప్రభుత్వం జీవో లో పేర్కొంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular