శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeజాతీయంమతిస్థిమితం లేని బాలికపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం

మతిస్థిమితం లేని బాలికపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం

హైదారాబాద్ నగరంలో కరోనా నేపధ్యంలో ప్రస్తుతం ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు దీనితో రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. ఇదే అదునుగా రెచ్చిపోయారు కొందరు దుర్మార్గులు ఓ మతిస్థిమితంలేని బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మానసిక వికలాంగురాలు అని కూడా కనికరం లేకుండా కొంతమంది యువకులు సామూహిక అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.

హైదారాబాద్ లోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో మతిస్థిమితం లేని ఓ బాలిక ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా ఆ అమ్మాయిపై ఆ ప్రాంతానికే చెందిన అక్బర్, జుమన్, గయాజ్‌, అలీంలు ఆమెను వెంబడించారు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించి అభంశుభం తెలియని ఆ అమ్మాయి వాళ్ళకామానికి బలైపోయింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.

వివరాలు చూస్తే… మతిస్థిమితం లేని బాలిక వెనకాలే వెళ్ళిన ఆ నలుగురు కామాందులు ఎవరూ లేని శిధిల భవనంలోకి తీసుకెళ్లి ఘోరానికి పాల్పడ్డారు. ఏమైందో ఏమో సమయం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ బాలికకు ఫోన్‌ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. కుటుంబసభ్యులకు కంగారు రావడంతో హుటాహుటిన దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో తెలుసుకుని దాని ఆధారంగా పోలీసులు ట్రెసింగ్ మొదలుపెట్టారు.

అలా  రెండు గంటల తరువాత దేవేందర్‌నగర్‌లో బాలిక ఆచూకీని  కనుగొన్నారు. అక్కడే దగ్గరలో ఉన్ననలుగురు కేటుగాళ్ళు పోలీసుల రాకతో పరారీలో ఉండగా దాంట్లో ఒకడిని పోలీసులు పట్టుకోగా అతను మిగిలిన ముగ్గురి వివరాలు జరిగిన బాగోతం బయటపెట్టాడు. నిందితుల పేర్లు అక్బర్, జుమన్, గయాజ్‌, అలీం ప్రస్తుతం వీళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ దుర్మార్గులపై కిడ్నాప్, అత్యాచారం మరియు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి  విచారిస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular