శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంఆ రైతు ఆలోచన కంటతడి పెట్టిస్తుంది.

ఆ రైతు ఆలోచన కంటతడి పెట్టిస్తుంది.

చాలామంది తాము పండించిన పంటలను పశుపక్ష్యాదులనుంచి రక్షించుకోవడానికి కంచెలు వేస్తారు తమిళనాడు లోని కోయంబత్తూర్​కు చెందిన ఓ రైతు మాత్రం అందుకు విరుద్ధంగా ఆలోచించాడు. అడవుల నుంచి వచ్చే పక్షుల ఆకలి తీర్చేందుకు అరెకరం భూమిని వాటికి కేటాయించి పెద్దమనసుతో మంచి ఉపాయం చేసాడు.

ఆ రైతు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో అరెకరం భూమిని పక్షుల తిండి కోసం వదిలేస్తున్నాడు. అంతేకాదు ఆ పక్షులు ఇష్టాంగా తినే తిండిగింజలని పండిస్తున్నాడు ఆ రైతుది ఎంత గొప్ప మనసొకదా. దేశం మొత్తం లొక్డౌన్ లో ఉన్న ​ సమయంలో ఈ ఆలోచన వచ్చిందట. తన ప్రాణం ఉన్నంతవరకు ఈ పద్ధతిని అనుసరిస్తానని చెబుతున్నారు ఆ గొప్పమనసున్న  తమిళనాడుకు చెందిన రైతు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular