ఏపీలో మొదటి కరోనా మరణం .. జాగ్రత్త

0
156
First corona death in ap
First corona death in ap

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం కన్నెర్రజేయడం ఆపడం లేదు రోజురోజుకూ పాజివ్ కేసులతో ప్రజలను పట్టిపీడిస్తోంది.. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఒక్క మరణం కూడా నమోదు కాని ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కరోనా వల్ల ఒక వ్యక్తి మ్రుతి చెందడం జరిగింది.

విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయినట్టు వెళ్లడైంది. మార్చి 30 హస్పిటల్ కు చెకప్ కోసం వచ్చారని తరువాత కొంత సేపటికి మధ్యహ్నం 12; 30 గంటలకు తను చనిపోయాడని ప్రభుత్వం తెలిపింది.

అయితే తన కుమారుడి నుండే వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తికి హైపర్ టెన్షన్ తో పాటు డయాబెటీస్ కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

తన కుమారుడు డెల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చాడని అధికారులు గుర్తించారు. అయితే క్రిందటి నెల 30 న తనకి కరోనా ఉన్నట్టు తేలిందని అదే రోజు ఆ వ్యక్తి చనిపోయినట్టు తెలిపారు.

చనిపోయిన రోగికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయిందని అధికారులు స్పష్టంచేశారు. అయితే వీరితో కాంటాక్ట్ అయ్యిన 25 మందికి పైగా క్వారెంటేన్ కు తరళించినట్టు అధికారులు తెలిపారు. చనిపోయిన వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తెలిపారు డాక్టర్లు.