మంగళవారం, జూన్ 18, 2024
HomeసినిమాAnnapoorani: లవ్ జీహాద్ ప్రమోట్ చేసిందుకు నయనతార పై FIR నమోదు

Annapoorani: లవ్ జీహాద్ ప్రమోట్ చేసిందుకు నయనతార పై FIR నమోదు

నయనతార ప్రధాన పాత్రలో హీరో జై మరియు ప్రధాన పాత్రలో సత్యరాజ్ నటించిన చిత్రం “అన్నపూర్ణి” ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు డిసెంబర్ లో దియేటర్ లో రిలీజైన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది అయితే ఈ సినిమా ఇప్పుడు పలు వివాదాలకు దారితీసింది. మీడియా కధనాల ప్రకారం హీరోయిన్ నయనతారపై ముంబై పోలీసులకు రమేష్ సోనక్కి కంప్లైంట్ ఇచ్చారు.

కంప్లైంట్ లో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చిత్రాన్ని తీసారని, హిందువులు ఆరాద్యంగా కొలిచే శ్రీరామున్ని కించ పరిచే విధంగా ఉందంటూ పిర్యాదులో పేర్కొన్నారు అంతేకాక ఈ సినిమా లవ్ జీహాద్ ను ప్రోత్సహించే విధంగా ఉందంటూ పిర్యాదు చేసారు.

అంతేకాక ఈ సినిమాలో ఒక సీన్ లో నటుడు జై శ్రీరాముడు మాంశం తినేవాడనే కోణంలో తీశారని చెఫ్ అవ్వాలనుకున్న హీరోయిన్ నయనతార చే బ్రాహ్మణ అమ్మాయిచే మాంశం తినిపించడం, ఈమెకు ఒక ముస్లిం బాయ్ ఫ్రెండ్ ఉండగా తాను దేవుళ్ళు మాంశాహారం తింటారు నీకు ఎందుకు ఇబ్బంది అని అనగా బ్రాహ్మణ అమ్మాయిగా నయనతార మాంశాహారం తినే సీన్ అంతేకాక చివర్లో మాంశాహార బిర్యాని వండడంతో పాటు చెఫ్ పోటీకి ముందు నయనతార చున్నీతో తల కప్పుకుని ఇస్లాం ప్రార్ధనలు కూడా చేసిన సీన్స్ ఈ సినిమాలో ఉండడంతో ప్రస్తుతం పలు హిందూ సంఘాలు ఈ చిత్రంపై మందిపడుతునన్నాయి.

అయితే రమేష్ సోనక్కి ఈ సినిమా డైరెక్టర్, హీరోయిన్ నయనతార, నిర్మాతలపై పిర్యాదు చేసారు. అంతేకాక హోం మంత్రి రవీంద్ర ఫడ్నవీజ్ కు వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే పలు మీడియా సంస్థల కధనాల ప్రకారం నేడు నయనతార తో పాటు ఈ చిత్రంలోని పలువురిపై FIR నమోదు చేసినట్లు తెలుస్తోంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular