చైనా అండతో ఆర్టికల్ 370 మళ్ళీ తెచ్చుకుందాం… ఫరూక్ అబ్దుల్లా

0
294
Farooq Abdulla comments on article 370
Farooq Abdulla comments on article 370

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ విషయంపై మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్లే చైనా ఎల్ఓసీ దాటి భారత్ పై దాడులు చేస్తుందన్నారు. భారత్ ఆర్టికర్ 370 రద్దుకు చైనా వ్యతిరేకమని తాము చైనా మద్దతుతో ఆర్టికల్ 370ని తిరిగి అమల్లోకి వస్తుందని మాకు ఆ నమ్మకం ఉన్నాదని తెలిపారు.

అయితే తనకు చైనా అధ్యక్షునికి మద్య ఎలాంటి సంబంధం లేదంటూ చైనా అధ్యక్షుడిని చాయ్ వాలా ఇండియాకు పిలిచి ఊయలలో కూర్చోబెట్టి మరీ ఊపారని మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోడీపై వ్యంగ్యాస్త్రాలు సందించారు.

అయితే గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లో 370 రద్దు చేసే క్రమంలో విద్వేషాలను రెచ్చగొట్టడం, అక్కడి యువతను ప్రేరేపిస్తుండడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వారిని హౌస్ అరెస్ట్ చేసింది.

వారిపై ప్రత్యెక సెక్షన్ల క్రింద అరెస్టు చెయ్యడం వంటివి చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలోదుమారం రేపుతున్నాయి. కొంత కాలంగా ఆర్టికల్ 370ని ఉద్దేసించి పాకిస్థాన్ కి అనుకూలంగా మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా ఇప్పుడు చైనా రాగం అందుకున్నారు.

తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు స్పందిస్తూ ఫరూక్ అబ్దుల్లా ను తక్షణమే దేశద్రోహిగా ప్రకటించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. 20మంది భారత జవాన్ల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న చైనాతో ఆర్టికల్ 370పై చర్చించడం దేసద్రోహమన్నారు.

ఒక వైపు భారత్ చైనాతో పోరాడుతుంటే మీరు చైనా సాయాన్ని కోరడం మీరు ఈ దేశంలో ఉండడానికి అనర్హులు అంటూ భారత్ లో ఉండడం ఇష్టం లేకపోతే చైనాకు వెళ్ళిపోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.