గురువారం, మార్చి 23, 2023
Homeహెల్త్మీ ముఖం మేలిమిలా మెరవాలంటే | Homemade Beauty Tips in Telugu

మీ ముఖం మేలిమిలా మెరవాలంటే | Homemade Beauty Tips in Telugu

అందంగా కనిపించాలని మంచి ఛాయలో ఉండాలని, ఆకర్షణీయంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ బయట తిరిగినప్పుడు పొల్యూషన్ వల్ల, దుమ్మూ ధూళి వల్ల ముఖం మొత్తం పాడైపోతుంది. నల్లని మచ్చలు, మొటిమలతో డార్క్ గా తయారవుతుంది. ఈ చిన్న విషయం కోసం ఆస్తమాటూ పార్లర్ కి వెళ్లలేం.

Homemade Beauty Tips in Telugu

ఇక మనం ప్రతి రోజూ ఎక్కువసేపు ముఖాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటాం. అలాంటి ముఖం పైన చిన్న ముడత వచ్చినా, మచ్చ కనిపించినా దాన్ని కనిపించకుండా ఎన్నో క్రీంలు వాడుతూ ఆ ముడతలు, మచ్చలూ  పోయేవరకూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాము. కాబట్టి  మన ముఖాన్ని అందంగా మృదువుగా చూసుకోవడాని ఏ చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..

ఇక విషయానికి వస్తే ఎంతో  సులభంగా మన ముఖాన్ని అందగా ఉండేలా కాపాడుకోవచ్చు. ఒక స్పూను శనగపిండి ,రెండు స్పూన్ల పెరుగు ,అర స్పూను పంచదార వేసి బాగా కలపండి. తరువాత రెండు ,మూడు చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక పదిహేను నిమిషాలు ఉంచుకొని ఆ తరువాత చల్లని నీళ్ళతో శుభ్రoగా కడుక్కోవాలి . ఇలా ప్రతి రోజూ చేస్తే మీ ముఖం ఎంతో ప్రకాశిస్థూ ఉంటుంది. తప్పక ప్రయత్నించండి.

RELATED ARTICLES

Most Popular