ఈ రోజుల్లో సుమారు ప్రతి ఒక్కరూ చర్మ సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. వాటినుంచి ఎలా బయటపడాలో తెలియక తికమక పడుతుంటారు. అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కాలు చెప్పినట్టుగా పాటిస్తే వారు కోరుకున్న చర్మ సమస్యలనుండి బయటపడతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రాంగా కడుక్కోవాలి.
face glowing tips ప్రతీరోజూ రాత్రి పూట ముఖం కడుక్కోవడం చాలా వరకు అందరూ చేయరు. అలా చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఉదయం అంతా బయట తిరుగుతూ ఉంటారు బయట కాలుష్యం మరియు ఎండ వల్ల ముఖం నిండా మట్టి పేరుకుపోతుంది దాన్ని కడగకపోతే క్రిములు అలాగే ఉండిపోయి ముఖంపై లేనిపోని పింపుల్స్ వస్తుంటాయి. కాబట్టి రోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖం పేస్ క్లీనర్ తో లేదా ఏదైనా మెన్స్ నైట్ మాయిశ్చరైజర్ శుభ్రాంగా కడుక్కోవాలి.
రెస్ట్ తీసుకోవాలి.
ప్రతీ మనిషి రోజుకి 8 గంటల సేపు నిద్ర పోవడం చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వలానే అదిక శాతం ఆరోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కూడా అంతే నిద్రలేకపోవడం వల్లకూడా ముఖానికి మొటిమలు కుడా వస్తాయి కాబట్టి ప్రతీ ఒక్కరికీ తగిన నిద్ర చాలా అవసరం.
మొటిమల స్థానం.
ముఖం పై ఎలాంటి చోట మొటిమలు వస్తున్నాయో తరుచుగా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అవి నోటి చుట్టుపక్కల వస్తే అది హార్మోన్ ల చేంజెస్ వాల్ల వచ్చాయని అర్ధం అలాకాకుండా ఒకవేళ మొటిమలు నుదిటి ప్రదేశంలో వస్తే అది చర్మం మీద ఉన్న జిడ్డు మరియు మృత కణాల వల్ల వస్తున్నాయని అని అర్ధం.
పింపుల్స్ క్రీం.
చాలా వరకు మగవారు కానీ ఆడవారు కానీ పింపుల్స్ పోవడానికి అనేక క్రీమ్స్ ను వాడుతుంటారు. వాటిలో సాలీసైలిక్ ఆసిడ్ కలిగి ఉన్న క్రీమ్స్ వాడడం వల్ల ముఖం పైన ఉన్న మొటిమలు మెల్లగా తగ్గిపోతాయి.