మంగళవారం, జూన్ 25, 2024
Homeఅంతర్జాతీయంచైనాకి ప్రాణభిక్ష పెట్టిన భారతీయుడు ….. శెభాష్

చైనాకి ప్రాణభిక్ష పెట్టిన భారతీయుడు ….. శెభాష్

ఒక్క భారతీయ డాక్టర్ యావత్ చైనా ప్రజల గుండెల్లో గొప్పగా నిలిచాడు.  చైనీయులకు తన హస్తవాసితో రాత్రిపగలు నిస్వార్థంగా సేవలందించి ఖాచీ హువా అనిపించుకున్నాడు. అంటే చైనా భాషలో  ‘సద్గుణ దాముడు’ అని అర్థం. అంతే కాదు అతనికి జ్నాపకార్థం ఓ కాంస్య విగ్రహాన్ని కూడా స్థాపించబోతున్నట్టు ప్రకటించింది చైనా.

చైనా ఎప్పుడెప్పుడు పక్కదేశాల భూభాగాలని మింగెద్దామా అని ఎదురు చూసే డ్రాగన్ అది. అలాంటి డ్రాగన్ జాపాన్ దురాక్రమణను ఎదుర్కొంటున్న సమయంలో చైనా  గాయపడ్డ తమ సైన్యానికి, అక్కడి ప్రజలకు వైద్యసేవలు అందించేవారు లేరంటూ పొరుగుదేశాలను సాయం కోరగా వెంటనే భారత్ మేమున్నామంటూ ఒక డాక్టర్స్ బ్రుందాన్నే చైనాకి  పంపింది. అలా వెళ్లిన వారు చైనాకు  ఎనలేని వైద్యసేవలు అందించారు.

వాళ్లలో చైనా ప్రజల హ్రుదయాల్లో నిలిచిపోయిన వ్యక్తే డాక్టర్. ద్వారకానాథ్ శాంతారామ్ కోట్నీస్. రాత్రిపగలు తేడాలేకుండా చైనీయులకు వైద్యం అందించి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కన్నుమూసిన  అత్యంత గొప్ప వ్యక్తి కోట్నీస్. అంతేకాక ద్వారకానాథ్ శాంతారామ్ కోట్నీసు చైనా మరియు భారత్ దేశాల మధ్య వారధిగా కొనియాడబడ్డారు.

డా”డి.యస్.కోట్నీస్ భారతదేశంలో గల మహారాష్ట్రలో ఉన్న షోలాపూర్ లో అక్టోబర్ నెల 10, 1910 సంవత్సరంలో జన్మించారు. చైనాలో ఉన్న హీబై ప్రావిన్స్ లోని, టాన్గ్జియాన్ కౌంటీలో ఉన్న  గీగాంగ్ అనే చిన్న గ్రామంలో డిసెంబర్ -9వతేదీ 1942వ సంవత్సరం లో చిన్నవయస్సులోనే అనగా తన 32వ ఏట తాను మరణించారు.

భారత్ ఆగ్నమేరకు చైనాలో ఆయన చేసిన నాలుగు సం,, రాల వైద్య సేవలు ఎంతో నిబద్ధతో కూడుకున్నవి. ఆ సేవలే కోట్నీస్ జీవిత ప్రయాణంలో అతడు దేశంకాని దేశంలో అమరజీవిగా పరిణామం చెందడానికి సాక్షాలుగా మారాయి.

ఒక్కసారి చరిత్రలోకి వెళితే 1938 నాటి రోజులవి ఓ పక్క ఇండియాలో స్వాతంత్ర్యపోరాటం తారాస్థాయికి చేరుతోంది. మరోవైపు చైనాలో మావో నాయకత్వాన కమ్యూనిస్టుల విప్లవ పోరాటం భగభగమంటోంది. ఇరుదేశాలు ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఆసమయంలో చైనాకి ఎదురైన కష్టం పుండుమీద కారం చల్లినట్టైంది.

జపాన్ చైనా మీద దురాక్రమణకి పాల్పడింది. దీంతో చైనా ఉక్కిరిబిక్కిరైంది ఆ సమయంలో చైనీస్ కి ఆధునిక వైద్యం అందని ద్రాక్ష.. సరైన డాక్టర్లు లేకపోవడంతో డ్రాగన్ సైన్యంలో క్షతగాత్రులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయారు. దీంతో  వైద్యుల్ని పంపి ఆదుకోవాలని చైనా మిత్రదేశాల్ని అర్ధించింది. ఆ సమయంలో చైనా జనరల్ ఛూటే, జవహర్లాల్ నెహ్రుకి ఒక లేఖ కూడా రాశారు.

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నరోజులవి.. జాపాన్ దురాక్రమణను ఎదుర్కొంటూ డ్రాగన్ సైన్యం నేలకొరుగుతోంది. అది తెలిసిన సుభాష్ చంద్రబోస్  1938 జాన్ 30 న “కదలిరండి పొరుగుదేశమైన చైనాప్రజలకి సాయం చేద్దాం” అంటూ భారత ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు. ఒక పత్రికా ప్రకటనతోపాటు చైనాపై జపాన్ దాడిని ఖండిస్తూ మోడ్రన్ రివ్యూ పత్రికలో సుభాష్ చంద్రబోస్ వ్యాసం కూడా రాశారు.

అంతేకాకుండా అఖిల భారత చైనా నిధి పేరుతో 22 వేల రూపాయల నిధి సేకరించి. వీటితో పాటు నెహ్రూ కోరికపై ద్వారకానాథ్‌ శాంతారామ్‌ కోట్నీస్ అనే వైద్యుడితో పాటు అయిదుగురు డాక్టర్ల బృందాన్ని చైనా కు భారత జాతీయ కాంగ్రెస్‌ పంపింది. వాళ్లతో పాటూ ఒక అంబులెస్స్ కూడా చైనా వెళ్లింది. చైనా మాత్రం ఈ నాడు భారత్ పై తన దురాక్రమణలతో దొంగదెబ్బతియ్యడానికి ప్రయత్నిస్తూ తిన్నింటి వాసాలే లెక్కపెడుతోంది.. (బ్యాంగ్)

1939 లో డా. కోట్నీస్ మావో నాయకత్వంలోని జపాన్ సైన్యంతో వీరోచితంగా పోరాడుతూ క్షతగాత్రులతో నిండిపోయిన 8వ రూట్ ఆర్మిలో, ఉటాయ్ పర్వత ప్రాంతంలోని జిన్ చాజి సరిహద్దు వద్ద చేరుకున్నారు. మవో,  చైనా జనరల్ ఛూటే లతో సహా కమ్యూనిస్టు నాయకులంతా మన భారత వైద్యబ్రుందానికి స్వాగతం పలికారు. సాటి ఆసియా దేశం నుంచి వచ్చిన తొలి వైద్య బ్రుందాన్ని గుండెలకు హత్తుకున్నారు.

 కోట్నస్ బ్రుందం గాయపడిన సైనికులకు చికిత్స చేస్తూ దీక్షతో పనిచేశారు. ఎనిమిది వందలు పైచిలుకు మేజర్ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. డాక్టర్ కోట్నీస్ వయసు అప్పటికి 28 సం,,లో అంబులెన్స్ ల్లో తిరుగుతూ సైనికులకు నిరంతరం చికిత్స చేస్తూనే ఉన్నారు. కోట్నీస్ దీక్షనీ, అంకిత భావాన్నీ చూసి సైనికులూ, చైనా పార్టీ నాయకులూ చలించిపోయారు. చైనా విప్లవ శక్తిగా ప్రసిద్ధిగాంచిన, మావో నాయకత్వంలోని ఎయిట్ రోట్ ఆర్మీ కి కోట్నీస్ వైద్య సేవలు ఆరంభించారు.

ఉత్తర చైనా లోని ఉతాయ్ పర్వతశ్రేణులు సరిహద్దుల్లో పనిచేయడం అంటే ప్రాణాలతో చెలగాటమే. రాత్రీపగలూ తేడా లేదు. గాయపడిన వందలాది సైనికుల్ని తీసుకొస్తూనే ఉంటారు. తీరిక, విశ్రాంతి అనే మాటలు వినపడటానికి కూడా వీల్లేని పరిస్థితి. ఒక్కోసారి కోట్నీస్  బృందం 72 గంటలసేపు అలాగే అవిశ్రాంతంగా రెప్పవేయకుండా పని చేసేవారంటే వారి పరిస్థితి తీవ్రత ఎంటో అర్థం చేసుకోవచ్చు. అలా కోట్నీస్ దాదాపు 5 సం, అవిశ్రాంతంగా అక్కడే పనిచేశారు.

ఆ తరువాత డాక్టర్ కోట్నీస్ ని నార్మన్ బెతూన్ అంతర్జాతీయ శాంతి ఆస్పత్రికి డైరెక్టర్గా నియమించారు. దాదాపు అయిదేళ్లు కోట్నీస్ అవిశ్రాంతంగా  పనిచేశారు. అంతేకాక ఆయన 1941వ సవత్సరం డిసెంబర్‌ నెలలో లో కోట్నీస్ అక్కడే ఓ సాదారణ నర్సును పెళ్లి చేసుకున్నారు. 1942 ఆగస్టు 23 న వాళ్లకో కొడుకు పుట్టాడు ఆ బిడ్డకి YINHUA అని పేరు పెట్టాడు.

YIN అంటే ఇండియా అని HUA అంటే చైనా అని అర్థం. అంతాబాగానే ఉన్నా కోట్నీస్ ని విశ్రాంతి లేకుండా చేసిన సేవే దెబ్బతీసింది. క్షణం కూడా తీరిక లేకుండా చైనీయులకు వైద్యసేవ చేయడంలో నిమగ్నమైన కోట్నీస్ తన ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం మార్చిపోయారు ఒకటా రెండా వేలల్లో క్షతగాత్రులు వందల్లో ఎమర్జెన్సీలో ఒక్క కునుకేద్దామంటే ఎక్కడ ఒక ప్రాణం పోతుందోనని కోట్నీ ఏనాడు కంటినిండా నిద్రపోలేదు.

ఎక్కడ నాలుగు మెతుకులు తినడానకికెళితే ఆయువులు ఆగిపోతాయోనని మన కోట్నీస్ కడుపు కట్టుకుని మరీ సేవ చేశాడు. తననెవరూ ఆజ్నాపించలేదు తననెవరూ ఇబ్బందిపెట్టి పని చేయించలేదు కానీ సాటి మానవుడిగి మిత్ర దేశం కష్టకాలంలో ఉండటాన్ని చూసి భారతీయుడిగా సాయంచెయ్యడం తన బాధ్యత అనుకున్నాడు.

మన భరత మాత నేర్పిన మానవ సేవే మాదవసేవ అనుకుని అహర్నిసలు కష్టపడి చివరికి ఆరోగ్యం క్షణించి పక్షవాతంతో 1942 డిసెంబర్ 9 వ తేదీన కోట్నీస్ కన్నుమూశాడు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular