శుక్రవారం, ఏప్రిల్ 19, 2024
Homeజాతీయం94 మంది మద్యం దొరక్క...?

94 మంది మద్యం దొరక్క…?

నేడు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దొరక్క తెలంగాణతో పాటూ పలుచోట్ల చాలామంది మతిస్థిమితం లేక రోడ్లపై వింతగా ప్రవర్తిస్తున్నారు ఈ నేపథ్యంలో నాలుగు రోజులలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు. ఇక సోమవారం మరో ఇద్దరు ఈ మహమ్మారి బారినపడి చనిపోవడంతో ఇప్పటికి మొత్తం 10 మంది ప్రాణాలు వదిలారు.

ఇక తెలంగాణా పఠాన్ చెఱువు ప్రాంతంలో ఈ మద్యం ఐదుగురి ఉసురు తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణా వ్యాప్తంగా మద్యం దొరక్క మతికోల్పోతున్న  వారి సంఖ్య రోజు రోజుకూ మరింత పెరుగుతూ వస్తోంది. దాదాపు ఇప్పటికి 94 మంది మద్యం బాధితులు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలనయానికి చేరుకొని తమను ఏదోటి చేసి కాపాడమని మొత్తుకుంటున్నారు.

ఇప్పటివరకూ హాస్పటల్ లో చేరిన వీరంతా  మానసిక ఒత్తిడి, నిద్ర పట్టకపోవడం,  తిక్కగా మాట్లాడట, చేతులు, కాళ్లు వణకడం ఇటువంటిమరిన్ని  లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం ఔట్‌ పేషెంట్లుగా, 60 మందికి ఇన్‌ పేషెంట్లుగా చికిత్స అందిస్తున్నట్టు అక్కడి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ఉమాశంకర్‌ తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular