ఆదివారం, మే 26, 2024
HomeరాజకీయంBYJU’S ట్యాబ్స్ కొనుగోలు లో 1460 కోట్లు స్కాం..ఈ రాష్ట్రాన్నిచంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు..వైసీపీ ఎమెల్యే

BYJU’S ట్యాబ్స్ కొనుగోలు లో 1460 కోట్లు స్కాం..ఈ రాష్ట్రాన్నిచంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు..వైసీపీ ఎమెల్యే

తాజాగా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే డి.ఎల్ రవీంద్రారెడ్డి జగన్ పాలనపై మరియు ప్రభుత్వ అవినీతిపై మీడియా సమావేశంలో  తీవ్ర విమర్శలు చేసారు. అదికూడా జగన్ పుట్టినరోజు కావడంతో ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

 మైదుకూరు నియోజక వర్గం వైసీపీ నుండి గెలుపొందిన డి.ఎల్ (దుగ్గిరెడ్డి లక్ష్మీ రెడ్డి) గత కొంత కాలంగా ప్రభుత్వం తీరుపై పలుమార్లు తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత నెలకొన్న పరిస్థితులపై మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత వైసీపీ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఆయన కుమారుడిగా ఇంత అవినీతిపరుడని అనుకోలేదని అన్నారు డీ.ఎల్.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే అవినీతి మొదలుపెట్టారన్నారు. ఈ వైసీపీ పార్టీలో ఉన్నందుకు నామీద నాకే అసహ్యంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి సింగిల్ డిజిట్ వస్తే చాలా గ్రేట్ అంటూ విమర్శించారు. ఈ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందంటూ ఎన్నిసార్లు అదిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు.

అంతేకాక నేడు జగన్ పుట్టినరోజు సందర్భంగా స్కూల్ పిల్లలకు BYJU’S ట్యాబ్స్ పంపిణీ పై కూడా విమర్శించారు. 1460 కోట్ల రూపాయల స్కాం జరిగిందంటూ ఈ BYJU’S ట్యాబ్స్ కొనుగోలు ఒక పెద్ద కుంభకోణం అంటూ దీనివెనుక కడపకు చెందిన ఇద్దరు పెద్దమనుషులు కూడా ఉన్నారంటూ విమర్శించారు. తాను తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ని దృష్టిలో పెట్టుకునే ఈ పార్టీలో చేరానని అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం అవినీతి మయంగా ఉందన్నారు. అంతేకాక రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకు వచ్చారని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారంటూ మళ్ళీ రాష్ట్రం కోలుకోవాలంటే 2024 లో చంద్రబాబు అదికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రాని కాపాడగలడని మీడియా సమావేశంలో తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో పోటీపై తెలపకపోయినా కచ్చితంగా ఒక గుర్తింపు పొందిన పార్టీ నుండి పోటీ చేస్తానని తెలిపారు. అంతేకాక టీడీపీ మరియు జనసేన పోటీ చేస్తే బాగుంటుందని ఇది నా ఒక్కడి అభిమతం అంటూ మీడియాకు తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular