ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్ట్ త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. అప్పట్లో మహారాష్ట్రలో నిభందనలకు విరుద్దంగా నిర్మించిన బాబ్లీ డ్యామ్ సందర్శనకు chandrababu naidu నేత్రుత్వంతో కూడిన టీడీపీ నేతలు వెళ్లారు మొదట డ్యామ్ సందర్శనకు అనుమతిస్తామని చెప్పిన పోలీసులు చంద్రబాబుతో సహాపలువురు నాయకులను అరుస్ట్ చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
దీంతో ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాటీచార్జ్ చేసారు ఈ ఘటనతో టీడీపీ నేతలతో సహా 75 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసారు. అంతేకాక డ్యామ్ వద్ద ఆందోలన చేసినందుకు గానూ పోలీనులు కేసు నమోదు చేసారు. ఇప్పుడు దీనికి సంభందించిన నోటీసులను ధర్మాబాద్ కోర్ట్ చంద్రబాబుకు ఇవ్వనున్నట్లు సమాచారం.