గురువారం, మార్చి 30, 2023
Homeరాజకీయందేవినేని ఉమ కు 14 రోజుల రిమాండ్ | Devineni Uma Remand

దేవినేని ఉమ కు 14 రోజుల రిమాండ్ | Devineni Uma Remand

Devineni Uma Remand  : టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ నిన్న కృష్ణా జల్లా లోని అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలిసి ఆ ప్రదేశానికి వెళ్ళిన ఆయనపై అక్కడినుండి తిరిగి వచ్చే సమయంలో ఉమ పై కొందరు వైసీపీ వర్గీయులు ఆయన ఉన్న కారుపై రాళ్ళ దాడి చేసారు అంతే కాక ఆయనతో ఉన్న మరో కారు అద్దాలు పగలగొట్టారు.

దీనితో ఆప్రాంతానికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు మరియు వైసీపీ కార్యకర్తల మధ్య గర్షణ వాతావరణం తలెత్తింది. అయితే ఆ రాళ్ళ దాడిలో టీడీపీ కి చెందిన కొంత మందికి గాయాలయ్యాయి దీనితో దేవినేని ఉమ రాళ్ళ దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చేందుకు ప్రయత్నించినా పోలీసులు దానిని నిరాకరించారు.

అయితే తాను ఉన్న కారులో సమారు 6 గంటల పాటు దీక్షకు దిగారు. అయితే రాత్రి పదకొండు గంటలవరకూ కారులోనే ఉన్న ఉమను కారు అద్దాలు బద్దలుకొట్టి మరీ అరెస్టు చేసి పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు తరలించగా నేడు కొంతసేపటి క్రితం మైలవరం కోర్టులో ఆన్ లైన్ లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టగా దేవినేని ఉమకు కోర్టు 14 రోజుల రిమాండ్ విదించింది.

అయితే దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ తో పాటు మరికొన్ని నాన్ బెయిలబుల్ సేక్షలతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఉమతో పాటు మరి కొంత మందిపై కేసులు నమోదుచేశారు పోలీసులు. ఇదిలా ఉండగా జరిగిన ఘటనపై దేవినిని తాను పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా తిరిగి తనపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసారని మండిపడారు.

ఈ ఘటనపై టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలు పలు చోట్ల నిరసనకు దిగగా పోలీసులు వారిని అరెస్టు చేసారు. ఇక ఈ విషయంపై టీడీపీ నేత పట్టాబి మాట్లాడుతూ కొండపల్లిలో వసంత కృష్ణ ప్రసాద్ చేస్తున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకుంటామని అన్నారు.

ఇక దేవినినే వెళ్ళే దారిలో కాకుండా పోలీసులు మరొక దారిని సూచించారని ఈ వ్యవహారం మొత్తం వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన జరిగిందంటూ పిర్యాదు చేసిన వాళ్ళనే అరెస్టు చేసే సంప్రదాయం ఒక్క వైసీపీ కి మాత్రమె చెల్లిందంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

Read Also..చైనా లో భారీ ఇసుక తుఫాన్ | China Sandstorm    

RELATED ARTICLES

Most Popular