కొడాలి నాని నీ బాష పశువుల భాషలా ఉంది … దేవినేని ఉమ

0
198
devineni uma cooment on kodaali nani
devineni uma cooment on kodaali nani

ఈ రోజు విశాఖలో చనిపోయిన వారి మృతదేహాలను ఎల్ జీ పాలిమర్ ఇండస్ట్రీ ప్రధాన ద్వారం ముందు కుటుంబ సభ్యులతో పాటు అక్కడి స్థానికులు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు.

ధర్నా చేస్తున్న ప్రదేశానికి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ చేరుకొని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. అయితే అవంతి శ్రీనివాస్ మాత్రం వీరిచేత కొన్ని దుష్టశక్తులు ఈపని చేయిస్తున్నాయన్నారు. 25 లక్షలు ఇస్తే సరిపోయేది అయినా జగన్ ఎవర్నీ అడగకుండానే కోటి రూపాయలిచ్చారన్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం కాస్తా వైసీపీ వర్సెస్ టీడీపీ గా మారింది. టీడీపీ నాయకులు మాత్రం జగన్ విమానం దిగగానే అక్కడికి సదరు కంపెనీ వాళ్ళు రావడం వారితో జగన్ మాట్లాడవలసిన పనేమిటో చెప్పాలనారు. పోయిన ప్రాణానికి కోటిరూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుని కంపెనీ పై ఎటువంటి చర్యలూ ఇప్పటివరకూ తీసుకోకపోవడంపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అయితే ఎప్పటిలాగే మీడియా ముందు కొడాలి నాని పరుష పదజాలంతో చంద్రబాబు పై బూతుపురాణం మొదలుపెట్టారు. చంద్రబాబు బతికున్నా చచ్చినటువంటి వ్యక్తి అన్నారు, ప్రభుత్వం పై విమర్శలు చేయాలి అనే ఉద్దేశ్యంతో చేస్తున్నారు కాబట్టి  చంద్రబాబుని లేక్కల్లోంచి తీసేయాలన్నారు.

కొడాలి నాని మాటలపై దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొడాలి నాని చంద్రబాబు, తెలుగుదేశం పై దూషించిన బాష పశువుల బాష అంటూ పశువులు కూడా ఇటువంటి బాష మాట్లాడవంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు మీ అసమద్దతని, వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి కొడాలి నాని ఇలాంటి పశువుల బాష మాట్లాడారన్నారు.