కరోనా తో మరణించిన వ్యక్తిని జేసీబీ లో తీసుకెళ్ళిన ఘటన

0
199
కరోనా వైరస్
కరోనా వైరస్

కరోనా మహమ్మారి దెబ్బకు కరోనా సోకిన వారిని వారు బంధువులైనా మరెవరైనా సరే వారిని దూరం పెట్టిన ఘటనలు చాలానే చూసాం. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే కరోనా సోకిన వ్యక్తి మరణించడంతో సదరు వ్యక్తి బందువులు ఎవరూ చివరిచూపుకు రాకపోవడంతో చివరికి స్మశానానికి తీసుకెళ్ళడానికి వాహనాలు కూడా రాకపోవడంతో కరోనా సోకిన వ్యక్తిని అక్కడి అధికారులు ఒక జేసీబీ లో వేసి స్మశాన వాటికకు తీసుకువెళ్ళిన ఘటన ప్రస్తుతం అందరినీ కలచివేసింది.

మున్సిపల్ సిబ్బంది తీసుకున్న ఈ నిర్ణయంపట్ల పలువురు ఆగ్రహానికి గురిచేసింది. ఈ విషయం పై సీఎం జగన్ సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఈ విషయం పై తన ట్విట్టర్ ద్వారా పలాసలో కరోనా మృతదేహాన్ని జేసీబీతో తరలించడం పట్ల తానను ఎంతగానో దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. మానవతా దృక్పదంతో మెలగాల్సిన ఇలాంటి సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు తనను బాదించిందని తెలిపారు. అలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలన్నారు. ఈ ఘటనకు సంబందిచిన బాద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన సంబందించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు. ప్రస్తుత ఘటన పై జాతీయ మీడియా సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.