గురువారం, జూన్ 8, 2023
Homeజాతీయంకరోనా అని శవాన్ని ఊరిబయటే వదిలేశారు

కరోనా అని శవాన్ని ఊరిబయటే వదిలేశారు

కరోనా తో చనిపోయాడని శవాన్ని వదిలేశారు.

కరోనా ప్రజలను వణికిస్తోంది రోజుకోలా వ్యాపిస్తూ అన్ని చోట్లా విస్తరిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా మాటే వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఒక దారుణం చోటు చేసుకుంది. చిత్తూరుజిల్లా రామసముద్రంలో దారుణం జరిగింది కరోనా వల్ల మృతిచెందాడనే అనుమానంతో శవాన్ని ఊరిబయట పొలాల్లో వదిలేసి పోయారు బంధువులు.

బెంగళూరు నుంచి స్వగ్రామం రామసముద్రానికి నడిచి వచ్చిన హరిప్రసాద్ ఊరి బయటే సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలొదిలాడు. ఆ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని అక్కడే పొలాల్లో వదిలేసి వెళ్లిపోయారు ఎవ్వరూ దరికికూడా రాలేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తియ్యగా మృతుడు రామసముద్రం మండలం మిట్టపల్లికి చెందిన హరిప్రసాద్ గా గుర్తించారు.

వెంటనే పోలీసులు శవానికి కరోనా పరీక్షలు చేయించగా అతను కరోనావల్ల చనిపోలేదని నిర్ధారణ అయింది. దింతో కుటుంబసభ్యులను పిలిపించి పోలీసుల సమక్షంలో దహన సంస్కారాలు చేయించారు. ఏది ఏమైనా ఇది హేయమైన చర్యగా పోలీసులు అభివర్ణిస్తున్నారు. ఇలా వివక్ష చూపడం తగదని అంటున్నారు. అందరం సమానమేనని కరోనా వచ్చినా కూడా వాళ్ళను దూరం పెట్టాలె తప్ప ఇలా ఒంటరివాళ్లను చెయ్యడం తగదని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular