బుధవారం, జూలై 17, 2024
Homeఅంతర్జాతీయందావూద్ ఇబ్రాహీం కి కరోనా పాజిటీవ్

దావూద్ ఇబ్రాహీం కి కరోనా పాజిటీవ్

ప్రస్తుతం పాకిస్థాన్ లో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తున్నా ఆదేశం మాత్రం అవేమీ తమకు పట్టనట్టు భారత్ పైకి తరుచూ ఉగ్రవాదులను ఆ దేశ ఆర్మీ బోర్డర్ దాటించి భారత్ లో హింసకు పాల్పడాలకి చూస్తోంది. అయితే ఇప్పుడు ఆదేశ ఉగ్ర నేతకు కరోనా సోకింది.

పూర్తి  వివరాలలోకి  వెళితే పాకిస్థాన్ మోస్ట్ వాంటెడ్ మరియు పాకిస్థాన్  డాన్ దావూద్ ఇబ్రాహీం కి  ప్రస్తుతం జనావాసాలకు అత్యంత దూరంగా ఆ దేశ సైనికులతో  రక్షణ పొందితున్నాడు.  ఇప్పటివరకూ  అండర్ వరల్డ్ డాన్ మరియు ఇండియా కి మోస్ట్ వాంటెడ్  దావూద్ ఇబ్రహీం కి కరోనా సోకినట్లు పాకిస్థాన్ కు సంబందించిన ఒక మీడియా సంస్థ తన వార్తా కధనంలో తెలిపింది.

దావూద్ ఇబ్రహీంతో పాటు అతని భార్య “మెహజబీన్ షేక్” కు కూడా  కరోనా పాజిటీవ్ వచ్చినట్లు నిర్దారణ అయ్యింది. వీరితో పాటుగా వీరి ఇంట్లో పనిచేసే సుమారు ఎనిమిది మంది పనివాళ్ళు మరియు దావూద్ ఇబ్రాహీం కి సంబందించిన సేక్యురుటీ కి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో వారిని కూడా పాకిస్థాన్ మిలటరీ హాస్పటల్ కి తరలించి అక్కడ క్వారంటైన్ లో ఉంచారు.

అయితే పాకిస్థాన్ లో ఉంటున్న కొందరు మాత్రం దావూద్ కరోనా తో చనిపోయాడని చెబుతున్నారు. అయితే దీనిని మనం పూర్తిగా నమ్మలేం ఎందుకంటే ఇది ఆదెశం ఆడుతున్న నాటకం కూడా అయి ఉండొచ్చు. పలు మార్లు   పాకిస్థాన్ “మసూద్” విషయంలో కూడా ఇలాంటి గేమే ఆడింది. అయితే పాకిస్థాన్ దావూద్ ఇబ్రాహీం కి చాలా సంవత్సరాలుగా  రాచ మర్యాదలతో ఆ దేశ మిలటరీ సెక్యురిటీ ఇచ్చి మరీ దావూద్ తమ దేశంలో లేడని చేబితోంది.

ప్రస్తుతం కూడా దావూద్ ను మిలటరీ హాస్పటల్ లో చేర్చడానికి గల కారణం ప్రపంచ దేశాల ఇంటర్ పోల్ దావూద్ పై ఎప్పటి నుంచో అతనిపై  నిఘా పెట్టడం ముంబై బాంబ్ పేలుళ్ళ తరువాత భారత్ సాక్ష్యాదారాలతో దావూద్ ను భారత్ కు అప్పగించే ప్రయత్నాలు చేసినా వాటిని పాకిస్థాన్ కొట్టిపారేసింది.  అయితే  అమెరికా మాత్రం  దావూద్ ను ప్రపంచ మోస్ట్ టెర్రరిస్టు లలో ఒకడిగా చేర్చి అంతనిపై ఓ కన్నేసింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular