మంగళవారం, జూన్ 18, 2024
Homeజాతీయందేశంలోని కరోనా హాట్ స్పాట్స్ ఇవే ...

దేశంలోని కరోనా హాట్ స్పాట్స్ ఇవే …

దేశంలో కరోనా వైరస్ అధికంగా స్ప్రెడ్ అవుతున్న ఏరియాస్ ని కేంద్రం కరోనా హాట్ స్పాట్స్ గా ప్రకటించింది. వీటిలో 10 ప్రాంతాలున్నాయి మరోవైపు 24 గంటల్లో కొత్తగా 386 కేసులు వెలుగులోకి వచ్చాయి. హజ్రత్ నిజాముద్దీన్ మత ప్రార్ధనలకి హాజరైన తబ్లీకి జమాత్ ప్రతినిధులవల్లనే వైరస్ వ్యాప్తి అమాంతం పెరిగిందని తేలడంతో వారి ఆచూకీ కోసం గాలింపు మొదలైంది. ఇప్పటివరకు 6000 మందిని గుర్తించి వారిలో 5000 క్వారెంటెన్ కు తరలించారు.

తెలంగాణ, గుజరాత్, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాల్లో 2000 మందికోసం గాలిస్తున్నారు. దేశంలో కేసుల సంఖ్య 1649 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా సంయుక్త కార్యదర్శి అగర్వాల్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తబ్లీగి జమాత్ కార్యకర్తలు దేశం మొత్తం తిరగడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని వారు తెలిపారు. ఇక కరోనాకు హాట్ స్పాట్స్ గా ఈ  ప్రాంతాలు ఉన్నాయ్

1) ఢిల్లీ  (పశ్చిమ నిజాముద్దీన్, దిల్షాద్ గార్డెన్ )

2) రాజస్థాన్ (బిల్వారా )  3)ఉత్తర్ ప్రదేశ్ ( నోయిడా, మీరట్ )  4)మహారాష్ట్ర (ముంబై )  5)గుజరాత్ (అహ్మదాబాద్ )  6)కేరళ (కాసగోడ్, పథానంతిట్ట )

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular