శనివారం, జూలై 27, 2024
Homeజాతీయంకరోనా పరీక్షలు ఇలా జరుగుతాయి.

కరోనా పరీక్షలు ఇలా జరుగుతాయి.

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పుడు అందరిముందు ఉన్న మార్గం ఒకే ఒక్కటి వీలైనంత తొందరగా ఎక్కువ సంఖ్యలో కారోనా టెస్ట్ లు చెయ్యడం దాని ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించి వాళ్ళను 14 రోజులు జనావాసాలకు దూరంగా కోరెంటెన్ లో ఉంచి చికిత్స అందించడం. దీని ద్వారా వ్యాప్తిని అరికట్టొచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్రం మొత్తం వైరస్‌ వ్యాప్తి నిర్ధారణకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా పాజిటివ్ అని తేలినవారికి సన్నిహితంగా ఎవరెవరున్నారో వాళ్లకు అలాగే లక్షణాలు ఉన్నవారికీ ఇప్పటికే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలతో పాటు, ట్రూనాట్‌, ర్యాపిడ్‌ యాంటీబాడీ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఆర్ టీ-పీసీఆర్ తో పాటూ కెమిలూమినిసెన్స్‌ పరిజ్ఞానంతోనూ వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ నాలుగు విధానాల్లో పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లను సమకూర్చుకునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాట్లు  చేస్తోంది.

ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష.

కరోనా ని ఖచ్చితంగా నిర్ధారించగల పరీక్ష ఇది దీనికోసం నోటి నుంచి ముక్కునుంచి స్వాబ్ తీసుకుని పరీక్షిస్తారు. ఈ పద్దతిలో కణంలోని ఆర్‌ఎన్‌ఏని పరీక్షిస్తారు కాబట్టి ఫలితం కచ్చితంగా ఉంటుంది. ఈ పరీక్షకు 5 వేల వరకూ ఖర్చవుతుంది. ఫలితానికి ఐదారుగంటలు సమయం పడుతుంది.

అయితే ప్రస్తుతం ప్రభుత్వం  ఐసీఎంఆర్‌ సరఫరా చేసిన కిట్లపైనే ఆధారపడి ఉంది. ఐసీఎంఆర్‌ సుమారు 5 వేల కిట్లు సమకూర్చింది. ఇప్పటికే మైల్యాబ్‌ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 7,500 కిట్ల కొనుగోలు చేసింది. ఇప్పటికే అవి వైద్య ఆరోగ్యశాఖకు చేరాయి.

ట్రూనాట్‌ పరీక్ష.

ఈ విధానంలోనూ స్వాబ్‌లనే పరీక్షిస్తారు. ఈ పరీక్షను  క్షయవ్యాధి నిర్ధారణకు చేస్తారు. అయితే కరోనా నిర్ధారణ పరీక్షకు  ట్రూనాట్‌ యంత్రాలు వాడొచ్చని  ఐసీఎంఆర్‌ తెలిపింది. పీసీఆర్‌ తో పోల్చుకుంటే దీనికి ఖర్చు తక్కువ. ప్రస్తుతం రాష్ట్రంలో 240 ట్రూనాట్‌ యంత్రాలున్నాయి. 37 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి అవసరమైన కిట్లను విశాఖలోని మెడ్‌టెక్‌జోన్‌లో తయారుచేస్తున్నారు.

ర్యాపిడ్‌ యాంటీబాడీ పరీక్ష .

దింట్లో రక్తం నమూనాలను పరీక్షిస్తారు. దీనికి రూ.700-850 వరకు ఖర్చవుతుంది. 30-45 నిమిషాల్లో ఫలితం వస్తుంది. ఈ కిట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 3 లక్షల కిట్లకు ఆర్డర్‌ ఇచ్చారు.

కెమిలూమినిసెన్స్‌ ప్రేక్ష .

దింట్లోకూడా  రక్తం నమూనాలను పరీక్షిస్తారు. ఈ  కిట్లు  మన దేశంలో దొరుకుతున్నాయి. మరికొన్ని విదేశాల్లో  కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా ఐదు లక్షల కిట్లు కొనాలన్నది ఆలోచన. లక్ష కిట్లకు ఇప్పటికే ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular