నేడు దేశవ్యాప్తంగా కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం అక్కడి కేసులను కట్టడి చెయ్యడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం పలు కఠిన చర్యలకు దిగింది. ఇక నిజాముద్దీన్ ఘటనతో కేసులు అమాంతం పెరిగిపోయాయి. అయితే తాజాగా రాష్ట్రపతి భవన్ లో కూడా పనిచేసే ఓ పారిశుధ్య కార్మికుడికి బందువుకు కరోనా పాజిటివ్ రావడం ఇప్పుడు కలకలం రేపింది. అతని తల్లి ఇప్పటికే కరోనాతో మరణించినట్టు సమాచారం.
ఈ సంఘటనతో రాష్ట్రపతి భవన్ అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. ఆ కార్మికుడి కుటుంబం మొత్తాన్ని ఈ నెల 18 న క్వారెంటెన్ కు తరలించింది. ఇక ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు 30 కుటుంబాలను ఇప్పటికే పర్వేక్షణలో ఉంచారు అధికారులు. ఈ ఘటనతో 500 మందికి పైగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంచినట్టు సమాచారం.