టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి కరోనా పాజిటీవ్

0
215
mahesh babu in isolation
mahesh babu in isolation

Mahesh babu Tests Positive: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఒమేక్రాన్ కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్న నేపద్యంలో భారత్ లో ఒక వైపు ఒమెక్రాన్ తో పాటు కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. దీనితో కరోనా కేసులు భారిగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది. 

గత కొద్దిరోజులుగా మొకాలి నొప్పితో భాదపడుతున్న మహేష్ బాబు గత నెల స్పెయిన్ లో చస్త్ర చికిత్స చేయించుకున్నారు. అనంతరం అక్కడి నుండి దుబాయి వెళ్ళిన మహేష్ బాబు కొంచెం అన్ హేల్దీ గా ఉండడం మరియు కొంచెం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది దీనీతో ఆయన హోం ఐశోలేషన్ లోకి వెళ్ళిపోయారు .

అయితే తనకు ఎలాంటి ప్రాబ్లెం లేదంటూ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని నా ఆరోగ్యం బాగా ఉందంటూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే మహేష్ బాబు తో పాటు తన కుటుంబ సబ్యులు కూడా కరోనా టెస్టు చేయించుకున్నట్లు తేలుస్తుంది.