శనివారం, జూలై 27, 2024
Homeఅంతర్జాతీయంWHO ను బెదిరించిన చైనా.. ! అసలేం జరిగిందో చూస్తే షాక్...

WHO ను బెదిరించిన చైనా.. ! అసలేం జరిగిందో చూస్తే షాక్…

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఇక ఇంతటి అనర్ధానికి కారణమైన వైరస్ చైనాలో పుట్టిందని చైనా చేసిన ప్రయోగాల్లో భాగంగా అవి వికటించి కరోనా వైరస్ వచ్చిందనే వాదనలు యావత్ ప్రపంచం చేస్తున్నాయ్. ఇక అగ్రరాజ్యానికి చైనాకి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది అనడం లో ఆశ్చర్యంలేదు. ట్రంప్ చైనా పేరు చెపితే కారాలు మిరియాలు నూరేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే  ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ను ఆపేందుకు  చైనా ప్రయత్నించినట్టు దీనికి సంబంధించి వివరాలు  సీఐఏ తన తాజా నివేదికలో పొందుపరిచినట్టు ‘న్యూస్‌వీక్‌’ ప్రత్యేక కథనంలో తెలిపింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) పేర్కొంది.

కాగా, వైరస్‌ విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించామని WHO వర్గాలు పేర్కొన్నట్టు న్యూస్‌వీక్‌ వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, తమ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధ్‌నామ్‌ల మధ్య గత జనవరిలో ఫోన్‌ సంభాషణ జరిగిందన్న వార్తలను కూడా WHO ఖండించినట్టు పేర్కొంది.

వైరస్‌ విషయమై ప్రపంచ వ్యాప్త ఆరోగ్య అత్యవసర  పరిస్థితిని మీరు  ప్రకటిస్తే…తాము అందించే సహకారాన్ని నిలిపేస్తాం” అని చైనా WHO ను భయపెట్టినట్టు, బెదిరించినట్టు వివరించింది.

అయితే ఈ వ్యవహారమంతా మొదట్లో అంటే జనవరిలో కరోనా‌ కేసులు చైనాలో వేగంగా  ప్రబలుతున్నప్పుడు ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు తెలిపింది. చైనా పై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్న తరుణంలో పైగా వైరస్‌కి బాధ్యత చైనాయే వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేస్తుండటం వీటన్నిటిమధ్య  ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular