తైవాన్ గగంతలలోకి ప్రవేసించిన చైనాకు చెందిన 39 యుద్ధ విమానాలు

0
175
chaina taiwan dispute
chaina taiwan dispute

రోజు రోజుకూ చైనా ఆక్రమణ ధోరణి తీవ్ర స్థాయికి చేరుతోంది ఒక వైపు భారత్ తో బోర్డర్ వద్ద ఆక్రమణలకు పాల్పడుతూ ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అంతేకాక చైనా పొరుగు దేశమైన తైవాన్ పై తన బలాన్ని ప్రదర్శిస్తూ పొరుగు దేశాల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జొన్ (Taiwan air defence zone) లోకి China కు చెందిన J-16 యుద్ధ విమానాలు-24, J-10 యుద్ధవిమానాలు-10 వీటితో పాటు న్యూక్లియర్ సామర్ద్యం గల Bomber లను మొత్తంగా సుమారు 39 యుద్ధ విమానాలను Taiwan గగనతలం లోకి ప్రవేశించి చెక్కర్లు కొట్టడంతో అప్రమత్తమైన తైవాన్ వెంటనే తన ఫైటర్ జెట్ లను రంగంలోకి దింపింది అంతేకాక Taiwan మిసైల్ వార్నింగ్ ఎలర్ట్ లను China యుద్ధ విమానాలకు పంపించడంతో కొంత సేపటికి అక్కడినుండి వేనుతిరిగాయి.

చైనా మరియు తైవాన్ దేశాల మద్య ఇలాంటి ఘటనలు జరగడం ఇది కొత్తేమీ కాదు ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చైనా మాత్రం Taiwan తమ భూభాగమంటూ దానిని స్వాదీనం చేసుకుంటామంటూ చెపుతూ వస్తుంది. అయితే రెండు నెలల్లో ఇంత భారీగా యుద్ధ విమానాలు Taiwan గగనతలంలోకి రావడం ఇది మూడో సారి గతంలో 56 యుద్ధ విమానాలను Taiwan గగనతలంలోకి పంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తైవాన్ పై China దురాక్రమణ పై చైనాకు అమెరికా హెచ్చరికలు చేసినా చైనా మాత్రం అక్రమ చొరబాట్లను మానడంలేదు.

Read Also.. అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సక్సెస్ … మిసైల్ రేంజ్ చూసి చైనాకు వణుకు

Read Also..BrahMos Supersonic Cruise Missile: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్ పరీక్ష విజవంతం