ఆదివారం, మే 26, 2024
Homeఅంతర్జాతీయంచైనా కు షాక్ రాయబారి కన్నుమూత..!

చైనా కు షాక్ రాయబారి కన్నుమూత..!

ఎక్కడిక్కక్కడ లాక్ డౌన్ నడుస్తూ అంతా కరోనా హడావిడిలో ఉన్నారు అయితే చైనాలో కరోనా పుట్టినప్పటి నుంచి ఆదేశ వ్యాప్తంగా యావత్తు  స్తంభించిపోయిందో ఇక అప్పటినుంచే చైనాకు అన్ని కష్టాలు మెడకు చుట్టుకున్నాయనే చెప్పాలి. ఇప్పుడు చైనా కు చెందిన రాయబారి మరణం కూడా అలాంటిదే.

డ్యు వీయ్  ఇజ్రాయెల్‌ లో‌ ఉన్న  తన సొంత నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు తెలుస్తోంది. టెల్‌ అవీవ్ అనే‌‌ నగరంలో తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటంతో సహాయక సిబ్బంది ఆయన్ని  ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

57 సంవత్సరాల వయస్సు ఉన్న డ్యు వీయ్‌ గత ఫిబ్రవరి నెలలోనే ఇజ్రాయెల్‌లో కొత్తగా చైనా రాయబారిగా అక్కడ  బాద్యతలు చేపట్టారు. కాగా అతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కరోనా ఆంక్షల నేపద్యంలో వీరు చైనాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. డ్యు వీయ్ మృతికి కారణాలు తెలియలేదని ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నట్లు  తెలిపారు.

అయితే దీనికి కారణం డ్యు వీయ్  ఆరోగ్య సమస్యలా లేక ఆయన మరణం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.అయితే దీనికి రెండు రోజుల ముందు ఇజ్రాయెల్‌ మరియు చైనా ల మద్య ఉన్న సంబందాన్ని అమెరికా కాలరాస్తుందంటూ అమెరికాపై పలు విమర్శలు చేసారు డ్యు వీయ్ .

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular