చంద్రబాబు లెక్కలు.. జగన్ కు లేఖ

0
157
chandrababu maidu image
chandrababu naidu

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది దాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం రాష్ట్రానికి దేశానికీ మంచిదికాదని చంద్రబాబు తెలిపారు. దీనిపై జగన్ కు మూడుపేజీల లేఖ రాసారు. ప్రపంచంలో 203  దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా గురించి తేలికమాటలు వద్దన్నారు. ఐరాసా ప్రధాన కార్యదర్శే కరోనా మహమ్మారి రెండవ ప్రపంచ యుద్ధం కంటే పెను సంక్షోభమని తెలిపినట్లు గుర్తుచేశారాయన.

ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా కేసులను త్వరగా గుర్తించాలని చంద్రబాబు తెలిపారు. మన రాష్ట్రంలో కేవలం నాలుగు పరీక్షా కేంద్రాలు ఉన్నాయని అవి ఏమాత్రం సరిపోవని అభిప్రాయపడ్డారు బాబు. తెలంగాణాలో 15, ఢిల్లీలో 14, కేరళలో 12, తమిళనాడులో 17, మహారాష్ట్రంలో  23 కేంద్రాలు ఏర్పాటు చేసారని ఏపీలో మాత్రం 4 కేంద్రాలే ఉన్నాయని వాటిని పెంచాలన్నారు.

5 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియాలో 650 పరీక్షా కేంద్రాలున్నాయని గుర్తుచేశారు చంద్రబాబు. మనం కూడా తగిన వాస్తవాలను కరోనా తీవ్రతను ప్రజలకు తెలియజేసి వాళ్ళను అప్రమత్తం చెయ్యాలను విజయవాడ, రాజమహేంద్రవరం లో  కరొనా తో చనిపోయినా బయటకి చెప్పడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయని వాటిపై నిజమెంతా అనేది ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చంద్రబాబు….