గురువారం, ఫిబ్రవరి 22, 2024
Homeరాజకీయంకట్టిన వాటిని కూల్చడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు... చంద్రబాబు

కట్టిన వాటిని కూల్చడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు… చంద్రబాబు

టిడిపి కేంద్ర కార్యాలయంలో మహానాడు వేడుక నేటి నుండి మొదలైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి పార్టీ జెండాను ఎగరవేశారు మహానాడు వేడుకలు టిడిపి ఎంతో వైభవంగా పార్టీ కార్యకర్తలతో జరుపుకునేది ప్రస్తుతం కరోనా భయంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలతో కలిసి ఆన్లైన్లో చంద్రబాబు మాట్లాడటం జరిగింది.

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచమంతా కరునాతో ఇబ్బందులు పడుతున్నాయి ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతూ సంవత్సర కాలంగా పార్టీ కార్యకర్తలు అనేక అక్రమ కేసుల్లో టిడిపి కార్యకర్తలని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందన్నారు.

వైజాగ్ గ్యాస్ లీకేజ్ గురించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని వైజాగ్ వెళ్ళటానికి పర్మిషన్ అడగడం జరిగింది కానీ ప్రభుత్వం తరపు నుండి స్పష్టమైన అనుమతి రాలేదన్నారు. దీనితో వైజాగ్ రాలేకపోయానని చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ అక్కడ ఉన్న కార్యకర్తలతో ఎప్పటికప్పుడ విపత్తు గురించి తెలుసుకున్నానన్నారు.

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాజీలేని పోరాటం చేస్తామని టిడిపి పార్టీ అధినేత తెలియజేశారు గ్యాస్ లీకేజీ బాధితులకు న్యాయం చేయాలంటూ పోస్టు పెట్టిన రంగనాయకమ్మ పై కేసు పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన పనులు ఏమీ లేవని కట్టిన వాటిని కూల్చడం తప్ప అని ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular