గురువారం, మార్చి 28, 2024
Homeరాజకీయంకార్మికుల భాధలు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి...చంద్రబాబు

కార్మికుల భాధలు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి…చంద్రబాబు

దేశంలో కరోనా విజ్రోంబిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి సుమారు 40 రోజులుగా ఇతర రాష్ట్రాల వలస కూలీలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారికీ తిండి లేక నానా అవస్థలూ పడుతున్నారు. అయితే నేడు కార్మిక దినోత్సవం నేడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఉద్దేసించి చంద్రబాబు జగన్ ప్రభుత్వం పై పలు వ్యాఖ్యలు చేసారు.

నేడు రాష్ట్రంలో ఉపాది కావాలన్నా ,పేదరికం పోవాలన్నా నాయకులకు దూరద్రుష్టి చాలా అవసరమన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అవేమి లేకుండా తమ పార్టీ స్వలాభం, తమ పార్టీకి అవసరమయ్యే పనులు చెస్తుందన్నారు.

ప్రభుత్వాలు, నేతలు ప్రజలకు ఇస్తున్న మాటలు తాత్కాలికం కాకూడదన్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్ గద్దెనెక్కినప్పటి నుండి పోలవరం పనులు పడకేయడంతో అక్కడ పనిచేసే కూలీలు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం అనేక పాలసీలు తీసుకువస్తుంది. ఒకసారి కొత్త పాలసీ తీసుకు వచ్చే ముందు దాని వళ్ళ కలిగే లాభ నష్టాలను ప్రభుత్వం దూర దృష్టితో చూడాలన్నారు. నాడు ఇలా చేయకుండా ప్రభుత్వం పాత పాలసీ రద్దు చేసేముందు కొత్త పాలసీ తీసుకురాకపోవడం చేతనే భవన నిర్మాణ  కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. అమరావతి లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్నారు.

నేడు కార్మికుల దినోత్సవం కావున కార్మికుల సంతోషం గురించి కాకుండా వారి ఆకలి భాదల గురించి మాట్లాడడం చాలా భాధగా ఉందన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆకలితో ప్రభుత్వం వైపు చూస్తున్నారని అన్నారు.

ఈ లాక్ డౌన్ సమయంలో కూడా కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు. ఆకలితో అలమటిస్తున్న చేతివృత్తి కార్మికులు, వలస కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు ఎవరికి తోచిన సాయం వారు చేసి వారిని ఆదుకోవాలన్నారు చంద్రబాబు .

 

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular