శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeజాతీయంకరోనాపై కేంద్రం సర్వే... ప్రతీ ఒక్కరికీ ఫోన్ కాల్

కరోనాపై కేంద్రం సర్వే… ప్రతీ ఒక్కరికీ ఫోన్ కాల్

భారత్ లో రోజురోజుకీ వందలకొద్దీ కరోనా పాజిటీవ్ కేసులు కొత్తగా పుట్టుకోస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలనుండి సర్వే చేయాలనే యోచనలో ఉంది. ఈ సర్వే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆదారంగా ప్రతీ పౌరుడి ఫోన్ కి 1921 నుండి ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఈ ఫోన్ కాల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమవద్ద నుండి కరోనాపై కీలక సమాచారం తీసుకోవడం జరుగుతుంది.

అంతేకాక కరోనాపై తమ అబిప్రాయాలను కూడా స్వేచ్చగా ఇవ్వవచ్చు. తద్వారా తక్కువ సమయంలో కరోనా ను కట్టడి చేసేందుకు కేంద్రానికి సహాయపడుతుంది. ఈ సర్వే లో ప్రతీ ఒక్కరూ తప్పకుండా  పాల్గొనాలని సూచించింది.  అయితే కరోనా పేరుతో వచ్చే నకిలీ కాల్స్, మేస్సేజెస్ పై జాగ్రత్తగా ఉండాలని సమాచార శాఖ కోరింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular