ఆదివారం, మే 26, 2024
Homeరాజకీయంకార్పోరేషన్ల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేసిందంటూ జగన్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ

కార్పోరేషన్ల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేసిందంటూ జగన్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ

రాష్ట్రం లో ఒకవైపు జగన్ సర్కార్ అప్పుల వేటలో తలమునకలై అమరావతి టూ డిల్లీ డైలీ సర్వీస్ చేస్తూ అప్పుల కోసం కేంద్రం వద్ద నానా తిప్పలూ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి నేడు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులగా అప్పుల కోసం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు తీసుకోవడంతో ఈ విషయంపై కేంద్రానికి పిర్యాదులు అందగా దానిని పరిశీలించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఏపీ ఎస్.డీ.సీ కార్పోరేషన్ ఏర్పాటును రాజ్యాంగ ఉల్లంగనగా అబిప్రాయపండింది.

ఇక అదే కార్పోరేషన్ కి పన్నులు వసూలు చేసిన ఆదాయం మళ్ళించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలతో రాజ్యాంగా విరుద్దంగా ప్రవర్తిస్తుందని దీనిపై సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయంటూ లేఖలో తెలిపింది. ఇక మద్యంపై అదనపు పన్ను వేసి అక్కడినుండి ఎస్.డీ.సీ కి బదలాయించి దానిని హామీగా చూపించి  ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో పేర్కొంటూ ఇది కూడా రాజ్యంగ ఉల్లంగన కిందకు వస్తుందని తెలిపింది.

ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే పైన చెప్పిన కార్పోరేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలపకుండా నిధులు తీసుకు రావడంపై కేంద్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్రం ఓవర డ్రాఫ్ట్ లోకి వెళ్ళిన కారణంగా బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి సిద్దంగా లేకపోవడంతో ఏకంగా ఒక కార్పోరేషన్ పేరిట విశాఖలోని తాసిల్దార్ కార్యాలయం, కలక్టరేట్, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిమరీ రాష్ట్రానికి అప్పులు తీసుకు వచ్చిన ఘటనపై కేంద్ర ఘాటుగా స్పందించింది.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు తప్పుల తడకగా ఉందంటూ దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే మరో విషయం ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ కారణంగా ఇకపై రాష్ట్రానికి అప్పులు పుట్టవనేది ఇండైరెక్ట్ గా తెలుస్తుంది.  

ఇప్పటికే టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఈ వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాస్తూ రాష్ట్ర ఖజానాకు సంబంధించి 46 వేల కోట్ల రూపాయలకు సంబందిచి ఒక్క బిల్లు కూడా లేదంటూ దేనిపై వివరణ కోరిన కొద్ది రోజులకే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాయడంతో రాష్ట్రంలో కార్పోరేషన్ పేరిట జగన్ ప్రభుత్వం తెస్తున్న అప్పుల వ్యవహారం కేంద్ర ప్రభుత్వ లేఖతో ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి దీనితో రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం ఆదపాతాలయానికి తీసుకు వెళ్ళిందని పలువురు అబిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి…. అక్రమ మైనింగ్ వ్యవహారంపై హైకోర్ట్ సీరియస్… శాటిలైట్ ఫోటోలు సమర్పించాలంటూ ఆదేశం

పుల్వామా దాడి సూత్ర దారి మసూద్ అజర్ మేనల్లుడు ఇస్మాయిల్ ను ఎన్కౌంటర్ చేసిన బలగాలు

విశాఖ భూగర్భంలో క్రూడ్ ఆయిల్ స్టోరేజ్.. భారీ ప్రాజెక్ట్ చేపట్టిన కేంద్రం

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular