శుక్రవారం, మార్చి 29, 2024
Homeరాజకీయంమూడు రాజధానుల విషయంలో మరో సారి షాక్ ఇచ్చిన కేంద్రం

మూడు రాజధానుల విషయంలో మరో సారి షాక్ ఇచ్చిన కేంద్రం

మూడు రాజధానుల విషయంలో రాజధాని రైతులకు కేంద్ర ప్రభుత్వం నేడు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే రెండు సార్లు ఏపీ హైకోర్టుకు రెండు రాజధానుల విషయంలో అఫిడవిట్ దాకలు చెయ్యగా నేడు మరో సారి అదనపు అఫిడవిట్ దాకలు చేయడంపై రాజధాని రైతులు కేంద్ర ప్రభుత్వం పై మండిపడుతున్నారు.

బీజేపీ, వైసీపీ పార్టీలు లోపాయికారి రాజకీయాలు చేస్తూ మూడు ముక్కల రాజదానులతో రైతుల జీవితాలను పూర్తిగా నాశనం చేశాయన్నారు. ఈ పార్టీల వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్నారు. తమకు న్యాయస్థానాలలోనే పూర్తిన్యాయం దొరుకుతుందనే నమ్మకం ఉందన్నారు.

అయితే కేంద్రం మాత్రం రాజదాని అంశం తమ పరిదిలో ఉండదని తేల్చి చెప్పింది. ఒక రాజదానే ఉండాలంటూ విబజన చట్టంలో లేదంటూ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టమైతే మూడు రాజధానులు పెట్టుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కరాకండీగా తేల్చి చెప్పింది. ఈ అదనపు అఫిడవిట్ ను కేంద్ర ప్రభుత్వం నేడు ఏపీ హైకోర్టుకు సమర్పించింది.

అయితే కేంద్రం మూడవ సారి అఫిడవిట్ ఇవ్వడానికి గల ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం పై మూడు రాజదానుల విషయంలో అనేక అభియోగాలు వచ్చినందు వలనే తాము ఈ అదనపు అఫిడవిట్ దాకలు చేసినట్లు తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై రాజదాని రైతులు తీవ్ర ఆగ్రహంతో నేడు బిక్షాటన చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైకరిపై నిరసన వ్యక్తం చేసారు.           

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular