శనివారం, జూలై 20, 2024
Homeరాజకీయంపుంగనూరు ఘటనలో చంద్రబాబు పై కేసు నమోదు

పుంగనూరు ఘటనలో చంద్రబాబు పై కేసు నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబు పై పోలీసులు నేడు కేసు నమోదు చేసారు. ఈ నెల 4వ తేదీన పుంగనూరు అల్లర్ల కేసులో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును బాద్యున్ని చేస్తూ A1 గా చేర్చి ఆయనపై కేసు నమోదు చేసారు పోలీసులు. పూర్తి వివరాలలోకి వెళితే.

ఈ నెల 4వ తారీకున చంద్రబాబు బహిరంగ సమావేశం నిమిత్తం పుంగనూరుకు చేరుకోగా అక్కడికి వైసీపీ నేతలు జెండాలు పట్టుకుని రావడంతో వైసీపీ మరియు టీడీపీ నేతల మద్య  ఘర్షణలు నెలకొన్న ఘటన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. టీడీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభను ఎలాగైనా అడ్డుకోవాలని వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ముందుగా తాము ఎలాంటి అల్లర్లు చెయ్యలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ రాళ్ళ దాడితోనే టీడీపీ నేతలు రాళ్ళ దాడికి పూనుకున్నారని అయితే వైసీపీ నేతలు తమపై రాళ్ళు విసిరితే మా కార్యకర్తలు గాయాలపాలయ్యారని అయినా పోలీసులు పట్టించుకోలేదని తిరిగి తమపైనే పోలీసులు లాఠీ చార్జ్ చేసారని అంటున్నారు.

ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడికి రాకుండానే అల్లర్లు జరిగాయి తరువాత అక్కడికి చంద్రబాబు వచ్చి ప్రసంగిస్తూ రాళ్ళ దాడి చేసిన వారిపై తీవ్ర విమర్శలు చేసారు అయితే చంద్రబాబుని ఈ ఘటనకు పూర్తి బాద్యున్ని చేస్తూ ఈ ఘటనలో చంద్రబాబు కుట్ర ఉందంటూ ముదివీడు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత ఉమాపతి రెడ్డి కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసి ఈ ఘటనలో A1 గా చంద్రబాబు A2 గా దేవినేని ఉమా A3 గా అమర్నాద్ రెడ్డి పేర్లను చేర్చారు.

అంతేకాక ఈ ఘటనలో మొత్తం 65 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్ లలో విచారిస్తున్నారు. అయితే బాదితుల కుటుంభ సభ్యులు మాత్రం దొంగ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఇంత చేసినా వైసీపీ నేతలపై మాత్రం ఎలాంటి కేసులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.        

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular