శనివారం, జూలై 27, 2024
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్ బోర్డర్ లో LY80 క్షిపనులు.... మరి భారత్ బ్రహ్మోస్ ఎక్కడ

పాకిస్థాన్ బోర్డర్ లో LY80 క్షిపనులు…. మరి భారత్ బ్రహ్మోస్ ఎక్కడ

మొట్ట మొదటిగా సారిగా 2006 లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్  మిస్సైల్ ను భారత ఆర్మీలో ప్రవేశ పెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ సుమారు 14 సవత్సరాలు గడుస్తున్నా బ్రహ్మోస్ 2  అయితే ఇప్పటికీ సరైన కార్యరూపం దాల్చలేదు. అయితే బ్రహ్మోస్ 2 ని బ్రహ్మోస్ 2కె గా మరల్చారు.

ఇక్కడ  కె అంటే కలాం అని అర్ధం వచ్చేలా మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది. బ్రహ్మోస్ 2కె యొక్క రేంజ్ 450 – 600 స్పీడ్ మ్యాక్స్ 8 వరకూ ఉంటుంది ఇది గంటకు 8500 కీ.మీ స్పీడ్ ప్రయానిస్తుంది. దీనిలో ర్యామ్ జెట్ ఇంజెన్ తో ప్రయానిస్తుంది.

ఒక్క సారి బ్రహ్మోస్ 2కె భారత్ చేతికి వచ్చిందంటే పర్వత ప్రాంతాలనుండి చైనా చేసే ఎటాక్ లను భారత్ సులభంగా బ్రహ్మోస్ తో అడ్డుకోగలదు. భారత్ ఆర్మీ పోస్టులకంటే చైనా ఆర్మీ 60 శాతం పోస్టులు ఎత్తులో ఉండడం వల్ల చైనాకు ఇదొక సానుకూల అంశం. చాలా చోట్ల చైనా వైపు కొండ ప్రాంతాలు ఉండగా వాటి మద్యలో బంకర్లు, ఆర్మీ బేస్ లను సైతం ఏర్పాటు చేసుకుంది.

ప్రస్థుత పరిస్థితిలో ఇండియా చైనా కు మధ్యలో యుద్ధం వచ్చే చాన్స్ చాలా తక్కువ ప్రస్తుతం పాకిస్థాన్ సరిహద్దుల్లో LY80 క్షిపణులను చైనా నుంచి కొనుగోలుచేసి దీనిని పాకిస్థాన్ భారత్ బోర్డర్ కు అతి తక్కువ దూరంలో ఏర్పాటుచేసిన తరుణంలో మన జాగ్రతలో మనం ఉండడం మంచిది.

అందుకే భారత్ బ్రహ్మోస్ పై ద్రుష్టి పెట్టింది. సాధారణ మిస్సైల్స్ తో చైనా బోర్డర్ లో ఉన్న పర్వత వెనుకవైపు ప్రాంతాలను అంత సులభంగా టార్గెట్ చేయడం కుదరదు. అదే బ్రహ్మోస్ 2k తో అతి సులభంగా 90డిగ్రీ కోణంలో ఉన్న బంకర్లను సైతం చేదిస్తుంది. అసలు బ్రహ్మోస్ హైపర్ సోనిక్ మిస్సైల్ గా అప్ గ్రేడ్ చేయకపోవడానికి చాలా కారణాలున్నాయి.

దీనిలో మొదటిది ఈ మిస్సైల్ ను భారత్ మరియు రష్యా లు సంయుక్తంగా రూపొందించడం. రష్యా బారత్ కు నమ్మదగ్గ మిత్రదేశం అయినా చాలా సార్లు రష్యా సాంకేతికతను బదలాయించే విషయంలో రష్యా చాలా సార్లు వెనకడుగు వేసి సుమారు 10 సంవత్సరాల కాలం గడిపేసింది.

సూపర్ సోనిక్ క్షిపణి గల దేశాలు చాలా తక్కువ అందు లోనూ భారత్ వంటి దేశానికి ఈ సాంకేతికతను ఇస్తే ఇండియా ఒక సూపర్ పవర్ గా ఎదుగుతుందనే ఉద్దేశమూ లేకపోలేదు. రష్యా భారత్ ల బందం బలంగా ఉన్నప్పటికీ  రష్యా భారత్ ను చాలాసార్లు మిత్రదేశంగా కన్నా ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా భావించిందనే చెప్పాలి. ఎదేమైనా రష్యా భారత్ కు చాలా సార్లు సాయం చేసిన మాట వాస్తవం.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular