శుక్రవారం, మార్చి 31, 2023
HomeసినిమాBrahmastra Trailer Talk | హాలివుడ్ రేంజ్ విజువల్ వండర్ లా బ్రహ్మాస్త్ర ట్రైలర్

Brahmastra Trailer Talk | హాలివుడ్ రేంజ్ విజువల్ వండర్ లా బ్రహ్మాస్త్ర ట్రైలర్

brahmastra trailer బాలివుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ మరియు ఆలియాభట్ జంటగా నటిస్తున్న భాలీవుడ్ ప్రెస్టేజియస్ మూవీ బ్రహ్మాస్త్ర. తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగంగా బ్రహ్మాస్త్రం పార్ట్-1 శివ పేరుతో తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో బాలివుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తోపాటు టాలివుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి వారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అస్త్రాలన్నిటికీ ప్రధాన అస్త్రం బ్రహ్మాస్త్రం ఈ బ్రహ్మాస్త్రాన్ని కాపాడడం కోసం హీరో శివ చేసిన పోరాటం విజువల్ వండర్ రూపంలో ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుండి పలు కేరెక్టర్ల పోస్టర్లను రిలీజ్ చేసిన చిత్రబృంధం తాజాగా నాగార్జున, మౌని రాయ్ వంటి వారి పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

brahmastra trailer talk

ఇక బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలెర్ లో ప్రతీ సీనూ చాలా వరకూ హాలివుడ్ గ్రాఫిక్స్ కు తీసిపోనివిధంగా ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే విజువల్ వండర్ అనడంలో సందేహం లేదు. ఇక నంది అస్త్రం నాగార్జున తోపాటు ఈ ట్రైలెర్ లో నీరు,గాలి,నిప్పు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి ఈ కధ బ్రహ్మాస్త్రానిది అంటూ వచ్చే చిరంజీవి వాయిస్ ఓవర్ ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచాయి. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్ పతాకంలో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

                               

brahmastra trailer

RELATED ARTICLES

Most Popular