శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeసినిమాభాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతున్న పుష్ప | Box office Pushpa Collection

భాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతున్న పుష్ప | Box office Pushpa Collection

సుకుమార్ డైరెక్షన్ లో అల్లూ అర్జున్ హీరోగా రాష్మికా మందన్నా హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన చిత్రం పుష్ప ( Pushpa The Rise ). ప్రదానంగా ఈ మద్య కాలంలో సాంగ్స్ పరంగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలో పుష్ప సినిమా మొదటి స్థానంలో నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రతీ సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతూ మంచి ఆదరణ పొందుతూ సినిమా రిలీజ్ కాకముందే ప్రేక్షకులకు పుష్ప సినిమాపై ఒక మంచి అబిప్రాయం ఏర్పడింది.

ఇక ఈ సినిమా టాక్ విషయానికి వస్తే మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. కేరళలో మాత్రం మొదటి రోజు టెక్నికల్ కారణాలతో చాలా చోట్ల రీలీజ్ కాకపోయినా తరువాత రోజు నుండి మంచి వసూళ్లనే రాబడుతుంది. దీనికి ప్రధాన కారణం కొంత మంది యాంటీ అల్లూ అర్జున్ ఫ్యాన్స్ దీనికి కారణమంటూ పుష్ప సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందంటూ ఎప్పటి నుంచో అల్లూ అర్జున్ పై కొంత మంది నేగిటీవ్ పబ్లిసిటీ చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అల్లూ అర్జున్ సినిమాలలో ప్రధానంగా చాలా వరకూ సినిమాలు టాక్ ఎలా ఉన్నా వసూళ్లు మాత్రం భారీగా ఉంటాయి అనడంలో సందేహం లేదు దీనికి ప్రదాన ఉదాహరణ పుష్ప కలెక్షన్స్. మూడు రోజుల Pushpa Collection ఈ విదంగా ఉన్నాయి.

Day wise Box Office  Pushpa collections

  • Day-1

                            AP / TS : 38.15 Cr        

                            Hindi : 03 Cr

                           Tamil Nadu : 2.6 Cr

                           Malayalam : 1.75 Cr

  • Day-2

                            AP / TS : 22.09 Cr        

                           Hindi : 03.9 Cr

                           Tamil Nadu : 2.4 Cr

                           Malayalam : 2.2 Cr

  • Day-3

                             AP / TS : 23 Cr        

                           Hindi : 6.4 Cr

                           Tamil Nadu : 2.6 Cr

                           Malayalam : 2.3 Cr

ఇక పుష్ప సినిమా హిందీ లో సూపర్ టాక్ సొంతం చేసుకుంది. హిందీ ఆడియన్స్ గత కొద్ది కాలంగా తెలుగు సినిమాలను చూసే నార్త్ ఇండియన్ ఆడియెన్స్ విపరీతంగా పెరిగారు. అందులోనూ ఇప్పటికీ మూస పద్దతి కధలతోనే బాలివుడ్ చాలా కాలంగా ప్రేక్షకాదరణ కోల్పోయింది. దీనితో ఇప్పుడు నార్త్ ఆడియన్స్ కి టాలివుడ్ ఆల్టర్నేటివ్ గా నిలిచింది.

దీనిలో భాగంగానే పుష్ప సినిమా హిందీ లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్ళను రాబడుతోంది. ఈ సినిమాలో అల్లూ అర్జున్ నటనకు అక్కడి ఆడియెన్స్ ఫిదా అవుతూ ఇలాంటి డీ గ్లామర్ రోల్స్ లో కూడా టాలివుడ్ అధ్భుత్మమైన కథలతో సక్సెస్ సాదిస్తున్నాయని అక్కడి ఆడియన్స్ కితాబిస్తున్నారు. హిందీ లో పుష్ప టాక్ పరంగా సూపెర్ టాక్ ఉన్నా కలెక్షన్స్ పరంగా ఇప్పుడిప్పుడే వసూళ్ళను సాదిస్తుంది.        

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular