ఆదివారం, జూలై 21, 2024
Homeరాజకీయంమూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం .. బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు

మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం .. బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు

రాష్ట్రంలో రాజధాని రగడ మరోసారి తెరమీదకు వచ్చింది గత కొద్ది రోజులుగా రాజధాని విషయం పై రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉండడంతో చాలామంది ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గిందనే అనుకున్నారంతా కాని నేడు బొత్స వ్యాఖ్యలతో రాజధాని విషయంలో ప్రభుత్వ వైకరి ఎప్పటికీ మారదనే విషయం అర్ధమౌతుంది.

తాజాగా నిన్న బొత్స సత్యన్నారాయణ రాజధాని విషయంపై మాట్లాడుతూ ఒక వర్గం కోసం రాజధానిని కొనసాగించాలా అంటూ అమరావతి రైతులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదన్నారు. కేవలం మూడు గ్రామాలకో లేక ఒక సామాజిక వర్గానికోరాష్ట్ర బవిష్యత్తు పరిమితం చెయ్యలేమంటూ లెజిస్లేటివ్ రాజధాని అమరావతి లో ఉంటుందన్నారు.

ఎట్టిపరిస్థితుల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని మునుపటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలపై కట్టుబడి ఉన్నామని అన్నారు. అంతేకాక మా విధానం, మా ప్రభుత్వ నిర్ణయం మాకు ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రైతులకు కౌలు డబ్బులు ఇవ్వడానికి దిక్కులేదు కాని వీళ్ళు మూడురాజధానులు కడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా ఆరావతిని నిర్వీర్యం చెయ్యాలనే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రైతులు అంటున్నారు.

రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణ ఒక సామాజిక వర్గంపై వ్యాఖ్యలు చేయడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజధాని విషయం బయటకు వచ్చినప్పుడల్లా సామాజిక వర్గం అంటూ..సామాజిక వర్గం అనేవాళ్ళు అసలు ముఖ్యమంత్రిది ఏ సామాజిక వర్గం అంటూ ప్రశ్నించారు.

ఓట్లు అడగడానికి వచ్చిన వారి తల్లిది, చేల్లెలది ఏ సామాజిక వర్గం అంటూ రైతులకు కవులు వెయ్యడం చేతకాని ప్రభుత్వానికి సామాజిక వర్గాన్ని ఈ విషయంలోకి లాగడానికి సిగ్గుగాలేదా అంటూ విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు అమరావతిపై దూషణలు చేసిన బొత్స నేటి వ్యాఖ్యలపై రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

  1. రాజధానుల పట్టికలో అమరావతి ప్లేస్ లో విశాఖను రాజధానిగా చూపిస్తున్న కేంద్రం
  2. అమరావతి సమరానికి 600రోజులు …మళ్ళీ ఉవ్వేత్తున ఎగసిన ఉద్యమం
  3. ఇండియా టుడే సర్వేలో భూతద్దంలో పెట్టి వెతికినా దొరకని జగన్ పేరు… 11 శాతానికి పడిపోయిన జగన్ గ్రాఫ్
  4. ఇకపై ప్రభుత్వ జీవోలు ఆన్లైన్లో పెట్టకూడదంట… దీని ఆంతర్యం అదేనా
WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular