శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeరాజకీయంపగ్గాలు బాబుకి ఇచ్చి చూడండి సవాల్ ... Bonda Uma

పగ్గాలు బాబుకి ఇచ్చి చూడండి సవాల్ … Bonda Uma

నేడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఎంత భయంకరంగా మారిందో  ఏపీ లో రాజకీయాలు కూడా అంతే హాట్ హాట్  గా నడుస్తున్నాయి. ప్రస్తుతం  అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు ఒకవైపైతే ఇంకోవైపు వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ట్వీట్ల బాణాలకైతే లెక్కేలేదు.

దీనిలో భాగంగానే చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్ గా ట్వీట్స్ చెయ్యడంలో వైసీపి తరపున విజయసాయిరెడ్డి ముందువరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలో బుగ్గన పై బోండా ఉమా కూడా హాట్ కామెంట్స్ చేశారు.

బుగ్గన రాజేంద్రప్రసాద్ పై Bonda Uma సెటైరికల్ గా విమర్శలు గుప్పించారు. ఆర్థిక మంత్రి బుగ్గన కేంద్రం నుంచి వచ్చిన నిధులపై లెక్కలు చెప్పాలని ఎప్పుడూ పిట్టకథలు చెప్పే బుగ్గన అసలులెక్క చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. దక్షిణాదిలో ఏపీ టాప్​లో ఉండటానికి కారణం ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలం అవ్వడం వల్లనే అని మండిపడ్డారు Bonda Uma.

ప్రభుత్వం చెప్తున్న నిర్దారణ పరీక్షలు సంఖ్య పూర్తిగా అసత్యమని ఆరోపించారు. అన్నింటికి రివర్స్ టెండర్లు అన్న ప్రభుత్వం కిట్ల కొనుగోలుకు అసలు టెండర్లే పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిట్ల కొనుగోలు విషయంలో మరిన్ని అక్రమాలు బయట పడతాయని బోండా అన్నారు. పాలన చేతకాకపోతే చంద్రబాబు దగ్గర శిక్షణ తీసుకోవాలని హితవుపలికారు.

మీకు పాలన చేతకాకపోతే చంద్రబాబుకు పగ్గాలు ఇవ్వాలని అప్పుడు కరోనాని ఎలా కట్టడి చెయ్యాలో బాబు  చూపిస్తారని Bonda Uma సవాల్ విసిరారు. చంద్రబాబు ఎప్పటికప్పుడు కరోనా పై అధ్యయనం చేసి అందరినీ అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular