గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeజాతీయంవామ్మో వైన్ షాప్ ముందు వరధబాదితుల్లా ఇలా..!మద్యం ధరపై పై మరో 50 శాతం పెంపు

వామ్మో వైన్ షాప్ ముందు వరధబాదితుల్లా ఇలా..!మద్యం ధరపై పై మరో 50 శాతం పెంపు

ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆరంజ్, రెడ్ జోన్ల లో మద్యం షాప్ లకి పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఏపీలో సోమవారం ఉదయం 11గంటల నుంచి మద్యం షాప్ లు  తెరచుకున్నాయి. ఇక లాక్ డౌన్ వల్ల నెలరోజులుగా మద్యం దొరక్క నోరారిపోయిన మద్యం కొనుగోళ్లు కు షాప్ ముందు కిలో మీటర్ల మేర క్యూ కట్టారు.

ఈ నేపథ్యంలో  భద్రాచలం పట్టణానికి అరకిలోమీటరు  దూరంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా ఎట్టపాక గ్రామంలోని మద్యం షాప్ తెరవడంతో మద్యం కొనుగోళ్ల కు ఆంధ్రా బోర్డర్ లో ఉండే తెలంగాణ మద్యం ప్రియులు కూడా ఏపి లోకి వచ్చి మద్యంకోసం కిలోమీటర్ల మేర క్యు లో బారులుతీరారు ఎంతో ఓపికగా నిలబడి మద్యం కొనుగోలు చేశారు.

అయితే రేపు TS ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగింపు పై అలాగే మద్యం షాపులు తెరవడం పై ఓ నిర్ణయానికి రానున్న నేపధ్యంలో  బోర్డర్ లో మందుషాపుల వద్ద బారులు పెరిగాయి. ఈ లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తార కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

ఇక ఏపీలో మద్యం షాపులు తెరుచుకోవడం మందుబాబులకు శుభవార్త అయినప్పటికీ పెరిగిన రెట్లు దిమ్మతిరిగేలా ఉన్నాయి నిన్న కొనుగోలు చేసిన మద్యం పై 25 శాతం పెంచిన జగన్ సర్కార్ ఈ రోజు మరో 50 శాతం ధరలను పెంచడంతో మందుబాబులకు  ఒక్కసారిగా ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular