గురువారం, ఫిబ్రవరి 22, 2024
HomeసినిమాBig Boss: బిగ్ బాస్ షో లో సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్టు

Big Boss: బిగ్ బాస్ షో లో సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్టు

హిందీ లో బిగ్ బాస్  సీజన్ 2  గొడవలు, తిట్లు, కొట్టుకోవడాలు, తో పాటు పలు వివాదాలకు కూడా బిగ్ బాస్  సీజన్ 2 వేదికగా నిలిచింది. ఒకవైపు ఈ షో పై విమర్శలు చేస్తుంటే షో కంటేస్టెంట్లు మాత్రం అవేవీ పట్టనట్లు హద్దులు మీరి రెచ్చిపోతున్నారు. ఇక దీనికి తోడు తాజాగా సల్మాన్ ఖాన్ కు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న సల్మాన్ ఖాన్ వీకెండ్ కా వార్ ఎపీసోడ్ లో చేతిలో ఒక తెల్లని వస్తువు కనపడింది దీనితో కొంతమంది సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో లో సిగరెట్టు తాగుతున్నాడని ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యగా అదికాస్తా వివాదంగా మారింది.

అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది మాత్రం సల్మాన్ ఖాన్ ఫ్యాన్ పేజి నుండే కావడం విచిత్రం. ప్రస్తుతం సల్మాన్ ను బిగ్ బాస్ షో నుండి ఎప్పుడు తప్పుకుంటారని అడుగుతున్నారు. అంతేకాక బిగ్ బాస్ లో సిగరెట్ జోన్ ఉందికదా సల్మాన్ మిగతా వాలని హెచ్చరిస్తూ తాను మాత్రం బయట సిగరెట్ త్రాగి అడ్డగంగా దొరికిపోయాడని అంటున్నారు.

ఒకవేళ సల్మాన్ ఖాన్ ఈ షో నుండి తప్పుకున్నా లేకపోయినా ఈ షో ఎడిట్ చేసే అతని ఉద్యోగం మాత్రం కచ్చితంగా పోతుందని విమర్శిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇదంతా ఫేక్ అని ఎవరో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారని ఇలాంటి ఫుటేజ్ బిగ్ బాస్ షో లో ఎక్కడా లేదని కొట్టిపారేస్తున్నారు.       

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular