పాకిస్థాన్ లోని బారత హై కమిషన్ అధికారుల మిస్సింగ్…భారత్ సీరియస్

0
222
bharat high comission officers in pakistan
bharat high comission officers in pakistan

పాకిస్థాన్ లో ఉన్న  భారత హై కమిషన్ అధికారులు ఇద్దరు నేటి ఉదయం నుండి కనిపించడంలేదు. దీనితో పాకిస్థాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రోజు ఉదయం ఇస్లామాబాద్ లోని భారత్ హై కమిషన్ కార్యాలయానికి పనిమీద బయలు దేరిన తరువాత నుండీ ఈ ఇద్దరి ఆచూకీ కనిపించలేదు.

వారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లు రావడంతో ఎంత వెతికినా భారత్ కు వారివద్డ నుండి ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం అందకపోవడంతో భారత్.. పాకిస్థాన్ దౌత్యకార్యాలయానికి పిర్యాదు చేసింది. అయితే పాకిస్థాన్ లోని భారత హై కమిషన్ అధికారుల పై అక్కడి ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన్ కొందరు వారి ఇంటివద్ద నిఘా పెట్టినట్లు కొన్నాళ్ళుగా వార్తలు వచ్చాయి.

అయితే కొద్ది రోజుల క్రితం భారత్ లో ఉన్న పాకిస్థాన్ హై కమీషన్ కు చెందిన అధికారులు ఇక్కడ ఫేక్ ఆదార్ కార్డ్ ఉపయోగించడం మరియు కొందరు అనుమానిత వ్యక్తులను కలవడం వంటి గూడచర్యం పాల్పడుతున్నారని వారిని దేశ బహిష్కరనపై వారిని పాకిస్థాన్ కు పంపేసింది భారత్. ఇప్పుడు భారత్ అధికారుల జాడ కనిపించకపోవడంతో భారత్ పలు అనుమానాలను వ్యక్తం చేస్తుంది.

అయితే కొన్నాళ్ళుగా భారత్-పాకిస్థాన్ బోర్డర్ లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంగిస్తూ భారత్ పైకి కాల్పులకు తెగబడటం దీనితో నిన్న భారత్ పాకిస్థాన్ పోస్టులు, బంకర్లపై విరుచుకుపడటంతో పాకిస్థాన్ ఇలాంటి కుటిల పన్నాగం పన్నిందని విస్లేసకులు అబిప్రాయపడుతున్నారు. అయితే భారత్ మాత్రం పాకిస్థాన్ వ్యవహారంపై సీరియస్ గానే స్పందించింది. గతకోన్నాల్లుగా ఇదే విదంగా భారత హై కమీషన్ అధికారులను వేదింపులకు గురిచేస్తున్నారని భారత్ విమర్శించింది.