రగిలే నిప్పు కణిక… భగత్ సింగ్ జయంతి ….

0
283
Bhagat Singh
Bhagat Singh

భగత్ సింగ్ ఈ పేరు చెబితే చాలు భారత దేశ యువతకు తను ఒక స్ఫూర్తి. బ్రిటీషువారి బానిస సంకెళ్లను తెంచి భారతీయుల స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం తనవంతు రక్తాన్ని దారబోసిన వ్యక్తి భగత్ సింగ్. భగత్ సింగ్ జన్మస్థలం భారత్ పాకిస్థాన్ దేశాలు విడిపోక ముందు ఉన్న పాకిస్థాన్ లోని పంజాబ్ లో ఉన్న కత్కర్ కాలాన్ అనే ఒక గ్రామంలో జన్మించారు.

బ్రిటీషువారి పాలనలో భారతీయ ప్రజలు పడుతున్న బాధలు మహిళలపై వారు చేసే అఘాయిత్యాలను చూసి చలించిపోయిన భగత్ సింగ్ మూతిపైకి ఇంకా మీసాలు రాని వయస్సులోనే స్వాతంత్ర్య సమరానికి సమాయత్తమై ఉద్యమం వైపు ఆకర్షితులయిన ఆయన ఆ ఉద్యమానికి తన ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు. యువతను ఒకే చెంతకు తెచ్చి బ్రిటీషు వారిపై ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసారు.

అయితే 23 మార్చి 1931 న భగత్ సింగ్ ను బ్రిటీషు వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేసిన కారణంగా ఆటన్ను బందించి ఇప్పుడు పాకిస్థాన్ లో ఉన్న లాహోర్ జైలులో భగత్ సింగ్ ను ఉరితీసారు. నేడు భగత్ సింగ్ యొక్క 113 వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయన్ను స్మరించుకుంటుంది. జోహార్ భగత్ సింగ్ ……