గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeక్రీడలుBGMI మరోసారి షాక్ భారీ సంఖ్యలో యూజర్ల భ్యాన్

BGMI మరోసారి షాక్ భారీ సంఖ్యలో యూజర్ల భ్యాన్

BGMI Updates in telugu ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లు కలిగిన గేమ్ పబ్జీ. తాజాగా ఈ గేమ్ తయారీ సంస్థ భారత్ కు చెందిన యూజర్ల డేటా చైనాకు చేరవేస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్ ని బ్యాన్ చేసి దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం పబ్జీ కి చెందిన పబ్లిషర్ సంస్థకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఆ గైడ్లైన్స్ తప్పకుండా పాటించాలంటూ నిభందనలు పెట్టింది

ప్రధానంగా ఈ నిభందనలో పబ్జీ గేమ్ కి చెందిన పుబ్లిషర్ ఇకపై ఇండియా నుండే తమ డేటా సెంటర్ పనిచెయ్యాలని, ఇకపై చైనా నుండి ఇండియాకు ఎలాంటి డేటా షేరింగ్ ఉండకూడదని సూచించింది దీనితో చాలా కాలం తరువాత మన దేశానికి వచ్చిన ఈ సంస్థ గేమ్ యొక్క పేరుని Battlegrounds Mobile India (BGMI) అనే పేరుతో క్రాఫ్టన్ అనే సంస్థ అదే ఫ్యూచర్స్ తో లాంచ్ చేసింది. ఈ గేమ్ లాంచ్ చేసిన కొద్దిరోజుల్లోనే కోటి మందికి పైగా  సబ్‌స్క్రైబర్స్ మరియు 4.3 రేటింగ్ తో ఇప్పటికే అదరగోడుతోంది.

 Battlegrounds Mobile India (BGMI) గేమ్ ఆడే యూజర్లకు క్రాఫ్టన్ సంస్థ అనేక నిబంధనలు పెట్టింది. వాటిలో గేమ్ ను ప్రభావితం చేసే ఎలాంటి సాఫ్ట్ వేర్ ఉపయోగించినా, సొంత టీం పై ఫైర్ ఆన్ చేసినా, గ్రనేడ్ విసిరినా, హ్యాకింగ్, వంటి వాటికి పూర్తి స్థాయిలో గేమ్ బ్యాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రతీ నెలా కొన్ని లక్షల మంది గేమ్ ఐడీ లు బ్లాక్ అవుతూ వస్తున్నాయి. అయితే తాజాగా గత నెల నుండి ఇప్పటి వరకూ 3,36,000 మంది అనేక విధాలుగా చీటింగ్ చేస్తూ గేమ్ ఆడే వారిని ఐడీలను బ్యాన్ చేసింది. అంతే కాకుండా ప్రైవేటు సర్వర్ ద్వారా కూడా ఈ గేమ్ గూగుల్ ప్లే స్టోర్ నుండి గాని మరే ఇతర ఫ్లాట్ ఫాం నుండి డౌన్లోడ్ అవ్వకుండా పూర్తి స్థాయిలో వారిని బ్లాక్ చేసింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular