కలబంద వల్ల కలిగే అద్బుతమైన ఉపయోగాలు | Best Aloe Vera Remedies

0
396
Aloe Vera Remedies in Telugu
Aloe Vera Remedies in Telugu

కలబంద అనేది ఒక హెర్బ్. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ కలబంద మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టుకి మరియు చర్మానికి బాగా  ఉపయోగపడుతుంది. చర్మం డ్రై గా ఉన్నప్పుడు ఈ కలబంద అప్లై చేసుకోవడం వల్ల చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా మారుతుంది. ఒకవేళ మీకు దగ్గర్లో కలబంద దొరకక పోతే కలబంద మిక్స్ అయ్యి ఉన్న లోషన్స్, క్రీమ్స్, మరియు జెల్స్ ని వాడొచ్చు.

ఇవి బయట మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతాయి. ఈ కలబంద విటమిన్స్, మినరల్స్, ఎమినోఆసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్కను కలిగి ఉంటుంది. కలబంద చర్మం ద్వారా సులభంగా గ్రహించబడుతుంది. కలబందలో ఉన్న విటమిన్స్, మినరల్స్ వల్ల మనకి దెబ్బ తగిలిన చోట దాన్ని అప్లై చేస్తే గాయం త్వరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా వివిధ డెర్మటాలజీ సమస్యలకు కూడా ఈ కలబంద ఎంతో సహాయ పడుతుంది.

దీంట్లో ఉన్న ఆసిడ్స్ వల్ల చర్మం మీద ఎటువంటి పింపుల్స్, రేషెస్ మరియు ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇది జుట్టుకి అప్లై చేసుకుంటే డాండ్రఫ్ పట్టకుండా ఉంటుంది. జుట్టు క్లీన్ గా కూడా ఉంటుంది. చివరిగా కలబంద మిక్స్ అయ్యి ఉన్న జెల్స్ ని కూడా వాడొచ్చు కానీ చాలా వరకు డైరెక్ట్ గా మొక్క నుండి తీసుకోబడిన కలబంద ను వాడటం చాలా మంచింది, చాలా ఆరోగ్యకరం. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకున్నారు కదా మంచి కాంతి వంతమైన  చర్మం మరియు జుట్టు కోసం తప్పక వాడి చుడండి…