బీట్ రూట్ ని ఒక అందాల ఘని గా అభివర్ణిస్తారు దీనిని శరీర అందానికీ మరియు ఆరోగ్యానికి కూడా ఉపయోగించవచ్చు. బీట్ రూట్ మన శరీర అందానికి ఉపయోగపడటం ఏమిటి అనుకుంటున్నారా!
అవును ఇది నిజం బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు అందానికీ అద్భుతంగా ఉపయోగ పడుతుంది ఎలానో ఇప్పుడు చూద్దాం.
Face Whitening Tips
- రెండు చెంచాల బీట్ రూట్ రసం మరియు చెంచా పాలు కలిపి ముఖానికి పట్టించాలి పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖానికి మంచి రంగు సంతరించుకొంటుంది.
- రెండు చెంచాల బీట్ రూట్ రసంలో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తరువాత ముఖాన్ని చల్లటి నీటితో శుబ్రం చేసుకుంటే మొటిమలతో పాటు మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. బీట్ రూట్ జ్యూస్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మంచి రంగుతో నిగనిగలాడుతుంది.
- బీట్ రూట్ ని మెత్తగా దంచగా వచ్చిన చూర్నానికి కొద్దిగా మీగడ కలిపి దానిని మొఖానికి మరియు మెడకు అప్లై చేసుకోవాలి ఇరవై నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి దీనితో ముఖం కోమలంగా తయారవుతుంది.
- కళ్ళక్రింద బ్లేక్ హేడ్స్ ఉన్నవాళ్ళు బీట్ రూట్ రసంలో కొంచెం చక్కర కలిపి మర్దన చెయ్యాలి ఇలా తరుచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.గమనిక : మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ శోదించి ఇచ్చినది మీరు వీటిని ప్రయత్నించే ముందు డాక్టర్ ని సంప్రదించండి ఎందుకంటే కొన్ని పదార్ధాలు అన్ని శరీర తత్వాలకూ వినియోగించాబడవు.